👉 లేఖలో సికాస కార్యదర్శి అశోక్ !
J.SURENDER KUMAR,
భారత విప్లవోద్యమ పురోగమనానికి ఆటంకంగా మారి, ద్రోహం తలపెడుతున్న మల్లోజు వేణుగోపాల్ నీవు కనీసం అమ్మ మధురమ్మకు ప్రతిజ్ఞాపూర్వకంగా ప్రకటించుకున్న నీ వీలునామా మరచి నీవు అమ్మకు కూడా ద్రోహం చేస్తున్నావు. అంటూ సింగరేణి కార్మిక సమాఖ్య కార్యదర్శి అశోక్ వీడియో చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి మల్లోజు వేణుగోపాల్ @ అభయ్, సోన్ ఉదాంతం గత కొన్ని నెలలుగా మావోయిస్టు పార్టీలో జరుగుతున్న విషయం విధితమే.
గత వారం రోజుల క్రితం మల్లోజుల వేణు ప్రతిపాదనకు మేము మద్దతిస్తున్నాం, ఆయన బాటలో పయనిస్తాం అంటూ సికాస కార్యదర్శి అశోక్ పేరిట ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలు ఎవరు చేస్తున్నారు ? ఎందుకు చేస్తున్నారు ? అనేది గందరగోళం
👉 లేఖలో..

ఓటమి విజయానికి తల్లిలాంటిది. ఉద్యమాల్లో, పోరాటాల్లో స్థల మార్పిడి ఉంటుంది కాని ‘అస్త్ర-సవ్యాసం” ఉండదు. ఇవన్ని వేణుగోపాల్ కు తెలియనివి కావు, భోదించనివి కావు, పేజీల కొద్ది రాయనివి కావు, పచ్చకామర్ల రోగిలాగా ఇప్పుడు పూర్తి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు… గుంపుకడుతున్నాడు… ఆయన చెప్తున్న ఈ సిద్ధాంతం చెల్లుబాటు కాదనేది తెలిసి కూడా గందరగోళం సృష్టిస్తున్నాడు పేర్కొన్నారు.
సికాని తరుపున మేము చికాగో అమరుల రక్తంతో మొదలైన ఎర్రజెండా పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ కార్మికుల హక్కుల సాధనలో ముందుకు సాగుతామని మరోసారి తెలియజేస్తున్నాము.
మీకు ఏమాత్రమైనా అమరుల త్యాగాలపైన ఏ మాత్రమైనా గౌరవం ఉంటే తప్పుడు ఆలోచనలు, విధానాలు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అంటూ తదితర అంశాలు సింగరేణి కార్మిక సమైక్య కార్యదర్శి అశోక్ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.