👉 మల్లోజు వెంట మేము మాడ్ డివిజనల్ కమిటీ ప్రకటన జారీ !
J.SURENDER KUMAR,
కేంద్ర కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి మల్లోజుల వేణుగోపాల్, @ అభయ్, @ సోను, రేపో మాపో, ప్రభుత్వానికి లొంగిపోనున్నారు అనేది బహిరంగ రహస్యమే అయితే లొంగుబాటు ప్రక్రియ లో ఆలస్యం ఎందుకు అనేది చర్చ. మల్లోజు వేణుగోపాల్ బాటలోనే మేము పయనిస్తామంటూ దండకారణ్యంలో మాడ్ డివిజనల్ కమిటీ కార్యదర్శి రాణితసనిత మంగళవారం ప్రకటన జారీ చేశారు.
వేణు @ సోను మావోయిస్టు లు సాగిస్తున్న సాయుధ పోరాటం నేపథ్యంలో యూటర్న్ తీసుకుని ఆయుధ విసర్జనకు ఇచ్చిన పిలుపును మావోలు మెజార్టీ గా వేణు వాదనలను ఖండించడంతోపాటు వేణు నిర్ణయాలు ఆయన వ్యక్తి గతం, అంటూ త్రోసి పుచ్చారు. శత్రువుకు లొంగి పోవాలంటే ఆయుధాలు అప్పగించి లొంగిపోవచ్చు అంటూ బహిరంగ ప్రకటనలో హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.
👉 అరణ్యంలో ? అర్బన్ లో ?
వేణు సైద్ధాంతిక విభేదాల కారణంగా అజ్ఞాత అడవి బాట నుండి మైదానంలోకి వచ్చే అవకాశాలు క్లియర్ అయితే, వేణు పార్టీ నాయకత్వానికి దూరంగా అర్బన్ ( పట్టణ ప్రాంతంలో ) దండకారణ్యంలో ఉన్నాడా ? కేంద్ర బలగాల ఆధీనంలో ఉంటూ ప్రకటనలు జారీ చేస్తున్నాడా ? అనేది మిస్టరీ.
వేణుకు గత కొన్ని నెలలుగా పార్టీతో సంబంధాలు లేవు . సహజంగా అనారోగ్యం, ఇతర కారణాలతో జనజీవన స్రవంతిలో కి వచ్చే దళ కమాండర్ స్థాయి మొదలుకొని కేంద్ర కమిటీ నాయకుల వరకు ముందస్తుగా పార్టీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆయుధాలు, ఆర్థికపరమైన అంశాలు, సాహిత్య సామాగ్రి, షెల్టర్ ప్రాంతాల్లో అప్పగించాల్సి ఉంటుంది. పార్టీ అనుమతించిన సమయంలో వారు పార్టీ నుంచి దూరమవడం పీపుల్స్ వార్ నుంచి వస్తున్న విధానం.
👉 కొన్ని నెలల క్రితమే దూరంగా…
మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా ఆయుధాలు వదిలిపెడదాం అంటూ విడుదల చేసిన పత్రికా ప్రకటన దాదాపు రెండు నెలల క్రితం (ఆగస్టు మాసంలో) విడుదల చేశారు.
👉 బస్తర్ ఫైటర్స్ తో …
దండకారణ్యంలో మావోల కోసం ప్రభుత్వం ఆదివాసీ యువకులతో బస్తర్ ఫైటర్స్, డిఆర్ జీ దళాలు ఏర్పాటుచేసి, జల్లాడ పడుతున్నాయి. దండకారణ్యంలో ఎత్తైన కొండలు గుట్టలు వాగులు వంకలపై ఈ దళాలకు అణువు అవగాహన ఉంటుంది. మావోల సమాచారం ఇచ్చిన ,సంహకరించిన వీరికి పెద్ద మొత్తంలో నగదు బహుమతులు ఇస్తారు అనేది జగమెరిగిన సత్యం.
👉దండకారణ్యంలో కదలికలు లేని దుస్థితి !1
అబుజమద్ అడవులను చుట్టుముట్టిన భద్రత దశాలు, నిరంతరం నిఘా నీడలో పహారా కాస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టులు తమ స్థావరాల నుంచి కదలలేని దుస్థితి నెలకొంది.
వేణుతో పాటు మరో కేంద్ర కమిటీ సభ్యుడు, కీలక నాయకులు, బస్తర్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లో కొన్ని ప్రాంతాల క్యాడర్ తో పాటు మంగళవారం మాడ్ కమిటీ కార్యదర్శి వేణుబాటలో మేము పయనిస్తామంటూ ప్రకటన జారీ చేశారు.
👉 దండకారణ్యంలో భద్రతా దళాల గస్తీ ఆపండి !

మాడ్ ప్రాంతంలో ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరగవని మేము బాధ్యతాయుతంగా ప్రకటిస్తున్నాము. దీనిని సాధించడానికి, దయచేసి కొంతకాలం భద్రత దళాల గస్తీని నిలిపివేయండి అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాడ్ కమిటీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
మాడ్ డివిజనల్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని డివిజన్‌లోని పార్టీకి మరియు పీపుల్స్ కన్‌స్ట్రక్షన్ కార్మికులకు వివరించాలి. కొనసాగుతున్న అణచివేత ప్రచారాల మధ్య మేము ఈ పనిని పూర్తి చేయలేము. మేము దీన్ని సాధ్యమైనంత
ఈ నెల 15వ తేదీలోపు మేము ఈ పనిని పూర్తి చేస్తాము. అంటూ పేర్కొన్నారు.
👉 మహారాష్ట్ర సీఎం ముందు . ?
వేణు తో పాటు కీలక నాయకులు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫండవిస్ ముందు లొంగుతారని ప్రచారం నెలకొంది. వేణు భార్య దళ కమాండర్ తారక్క, 2025 జనవరిలో మహారాష్ట్ర సీఎం ముందు గడ్చిరోలి లో తనతో పాటు మరో 12 మంది సభ్యులతో ఆయుధంతో లొంగి జనజీవన స్రవంతిలో చేరింది. ఈ నేపథ్యంలో వేణు సైతం తన సహచర మావోయిస్టులతో అక్కడే సరెండర్ అవుతారనే చర్చకు బలం, వేణు సరెండర్ కు మరింత సమయం పట్టవచ్చు అనేది చర్చ.