👉 పిసిసి అధ్యక్షుడి సమక్షంలో మంత్రుల మధ్య సయోధ్య !.
J SURENDER KUMAR,
మంత్రి లక్ష్మణ్ కుమార్ కు, మంత్రి పొన్నం ప్రభాకర్, హుందాగా క్షమాపణలు చెప్పారు. దున్నపోతు మాటలతో పెను దుమారం లేవడంతోపాటు, ప్రజాస్వామ్యవాదులు, దళిత సంఘాల ఆందోళనలు, దిష్టిబొమ్మల దగ్ధంతో కాంగ్రెస్ అగ్ర నాయకులు జోక్యంతో సమస్య సద్దుమణిగింది.
మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య తలెత్తిన వ్యాఖ్యల వివాదం బుధవారం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్య క్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాదులో ఇద్దరు మంత్రులను ఇంటికి ఆహ్వానించి సమస్యను ప్రశాంతంగా పరిష్కరించి ఇద్దరు మంత్రులు పక్క పక్కన కూర్చుండి బ్రేక్ ఫాస్ట్ చేయించారు. వారిద్దరితో పాటు, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కాన్సింగ్ రాజాకూర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్,, కార్పొరేషన్ చైర్మన్ లు ఈరవత్రి అనిల్, శివసేనారెడ్డి, డాక్టర్ వినయ్ పాల్గొన్నారు.
.
ఇద్దరు మంత్రుల మధ్య ఏర్పడిన వ్యాఖ్యల వివాదం ముగిసిందని పీసీసీ అధ్యక్షుడు మీడియాకు తెలిపారు. పొన్నం ప్రభాకర్ మాట్లా డుతూ.. ‘అన్న లాంటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. నా వ్యాఖ్యలను కొంతమంది రాజకీయ దురుద్దేశంతో వక్రీకరించడం వల్ల ఏర్ప డిన అపార్థాలతో లక్ష్మణ్ కుమార్ మనసు నొచ్చుకుందని తెలిసి తీవ్రంగా విచారిస్తున్నా. అందుకు ఆయనను క్షమాపణలు కోరుతున్నా అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ద్వారా సామాజిక న్యాయం కోసం మేమంతా ఐక్యంగా పని చేస్తాం. పార్టీలో నాకు లక్ష్మణ్ కుమార్ తో 30 ఏళ్లుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకు అతీతం, దీన్ని ఎవరూ విడదీయ లేరు’ అన్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ …’పొన్నం ప్రభాకర్ చేశారన్న వ్యాఖ్యలపై లక్ష్మణ్ సామాజిక వర్గం వారు బాధపడ్డారు. దీనికి చింతిస్తూ పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పారు. ఈ ఇద్దరు మంత్రులు కష్ట పడి పైకొచ్చిన వారు. ఈ సమస్య ఇంతటితో సమసిపోయింది. అందరూ కలసి పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు.
మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, అన్న పొన్నం ప్రభాకర్ క్షమాపణలతో సమస్య సమిసి పోయింది. మనోభావాలు దెబ్బతిన్నాయని ఆందోళన చేసిన నా మాదిగ జాతికి ప్రజాస్వామ్యవాదులకు కృతజ్ఞతలు అన్నారు.
ఈ సమస్యపై ఎలాంటి నిరసనలు వద్దని దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నానంటూ మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియా సమక్షంలో విజ్ఞప్తి చేశారు.