మావోయిస్టు నేత వేణుగోపాల్, లొంగుబాటు ఎక్కడ ?

👉 45 ఏళ్ల అజ్ఞాత  జీవితం ముగిస్తున్న సోనూ @ అభయ్ !

👉 నాడు మైదానం నుంచి అడవుల్లోకి, నేడు సైద్ధాంతిక విభేదాలతో అడవి నుంచి జనజీవనంలోకి..


👉 సాంప్రదాయ కుటుంబం తండ్రి, తాత స్వాతంత్ర సమరయోధులు !

👉 ఎన్కౌంటర్ లో హతమైన మావోయిస్టు అగ్రనేత కిషన్ జి కీ తమ్ముడు .!

👉 సి సి  సభ్యుడితో పాటు, బస్తర్,  జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లో కొన్ని ప్రాంతాల క్యాడర్ తో ?

👉 హైదరాబాద్ .?  హస్తినాలోనా ?

👉 ఆయుధాలతో లొంగుతారా ?  పార్టీకి అప్పగిస్తారా ?

J.SURENDER KUMAR,

విప్లవం అంటే విలాసవంతమైన జీవితం, విందు భోజనం కాదు, ఉద్యమమే ఊపిరిగా కొనసాగిన  ఎందరో ఎదురు కాల్పులలో ఊపిరి కోల్పోయారు.  అనారోగ్యంతో కొందరు జనజీవన స్రవంతిలో కలిశారు. 

అయితే నాలుగున్నర దశాబ్దాల అజ్ఞాత జీవితంలో  ఆరు పదులు వయస్సు దాటిన  ఆ నేత   మావోయిస్టు పార్టీలో సిద్ధాంతాల విభేదాలతోనా ? లేదా ఆధిపత్య పోరులోనా ? మరే ఇతర కారణాలా ? అనే అంశంలో స్పష్టత లేదు.

కానీ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి మల్లోజుల వేణుగోపాల్, @ అభయ్, @ సోను, ఆయనతో పాటు మరో కేంద్ర కమిటీ సభ్యుడు, కీలక నాయకులు,  బస్తర్,  జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లో కొన్ని ప్రాంతాల క్యాడర్ తో రేపో మాపో,  ప్రభుత్వానికి లొంగిపోనున్నారు అనేది బహిరంగ రహస్యమే.  లొంగుబాటు ప్రక్రియ హైదరాబాద్ లోనా ?  హస్తినలోనా ?  అనే అంశంలో స్పష్టత లేదు.

వేణుగోపాల్ (ఫైల్ ఫోటో)


👉 సిద్ధాంతాల విభేదాలతో…!


వేణు @ సోను మావోయిస్టు లు సాగిస్తున్న సాయుధ పోరాటం నేపథ్యంలో యూటర్న్ తీసుకుని ఆయుధ విసర్జనకు వేణు పిలుపు నిచ్చారు. మావోలు మెజార్టీ గా వేణు  వాదనలను ఖండించారు, స్వయంగా కేంద్రకమిటీ సభ్యుడు వేణు నిర్ణయాలు ఆయన వ్యక్తి గతం, అంటూ త్రోసి పుచ్చారు. శత్రువుకు లొంగి పోవాలంటే ఆయుధాలు అప్పగించి లొంగిపోవచ్చు అంటూ బహిరంగ ప్రకటనలో హెచ్చరికలు జారీ చేశారు.

👉 ఇళ్లు కూల్చినా, కన్నతల్లి మృతి చెందినా రాలేదు !

45 ఏళ్లగా  కన్న ఊరు పెద్దపల్లి ముఖం చూడని వేణుగోపాల్ తన ఇల్లు ను పోలీసులు నేల మట్టం చేసినా, కన్న తల్లి మృతి చెందిన రాని  వేణు  సైద్ధాంతిక విభేదాల కారణంగా అజ్ఞాత అడవి బాట నుండి మైదానంలోకి వచ్చే అవకాశాలు క్లియర్ అయ్యాయి.

1977 లో పెద్దపల్లి లో ఐటిఐ చదివి, బసంత్ నగర్ లో సిమెంట్ ఫ్యాక్టరీ లో ఉద్యోగం చేస్తూ వేణుగోపాల్ సోదరుడు కోటేశ్వరరావు @ కిషన్ జి  బాటలో పీపుల్స్ వార్ లో చేరి,  పెద్దపల్లి జూలపల్లి సుల్తానాబాద్ ధర్మారం మండలం లో ఏరియా కమిటీ సి ఓ గా పనిచేశారు.

1980 లో మైదానం వదలి అడవుల్లోకి వెళ్ళండి అనే వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య పిలుపుతో 1982 లో దండకారణ్యంలో (బస్తర్ ) లో అడుగుపెట్టిన వేణుగోపాల్ ఆదివాసి మహిళ, దళ కమాండర్  తారక్కను పెళ్లి చేసుకున్నాడు.

👉 మహారాష్ట్ర సీఎం ఫండవీస్ ముందు లొంగిన వేణు భార్య !

వేణుగోపాల్ భార్య తార మహారాష్ట్ర సీఎం ముందు లొంగిన దృశ్యం(ఫైల్ ఫోటో)


వేణుగోపాల్ కేంద్ర కమిటీ అధికారిక ప్రతినిధిగా కొనసాగుతున్న సమయంలోనే  ఆయన భార్య  దళ కమాండర్ తారక్క,  దాదాపు నాలుగు దశాబ్దాల అజ్ఞాత జీవితం నుంచి జనజీవన స్రవంతిలో 2025 జనవరిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ ఫండవీస్ ముందు గడ్చిరోలి లో తనతో పాటు మరో 12 మంది  సభ్యులతో ఆయుధంతో లొంగి సంచలనం సృష్టించారు. ఆమెపై  వివిధ పోలీస్ స్టేషన్లలో 66 కేసులు ఉన్నాయి ఆమె తలపై లక్షలాది రూపాయల రివార్డు ఉంది.

👉 వేణుగోపాల్ తో పాటు.. లొకేటి చందర్ కుటుంబ సభ్యులు కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న..?

కేంద్ర కమిటీ సభ్యుడు, ములుగు జిల్లా వెంకటాపూర్ కు చెందిన తక్కళ్ళపల్లి వాసుదేవరావు @ ఆశన్న, గతంలో నిజాంబాద్ జిల్లా వార్ కార్యదర్శిగా కొనసాగి, ప్రస్తుతం దండకారణ్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న డీఎస్కే  లోకేటి చందర్, ఆయన కూతురు కుమారుడు, బస్తర్,  జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లో కొన్ని ప్రాంతాల క్యాడర్ తో లొంగనున్నారని, ఈ లొంగుబాటు హైదరాబాద్ లోనా ?  హస్తినా లోనా? అనే అంశంతో పాటు ఆయుధాలతోనా ? నిరాయుదులుగా నా ?  ఈ లొంగుబాటు ప్రక్రియ సమాచార పై స్పష్టత లేదనేది మాజీలు, సానుభూతిపరులలో గత నాలుగు రోజులుగా చర్చ నెలకొంది.


ఈ నేపథ్యంలో  దండకారణ్య మావోయిస్టు పార్టీలో లొంగుబాటు పిడుగు లాంటి వార్తే    అయినా,  ఉద్యమం ఏ రూపంలో, ఎలా పురుడు పోసుకుంటుందో ? లేదో ? వేచి చూడాల్సిందే.

👉 వేణు  కుటుంబ నేపథ్యం..

వేణుగోపాల్ తల్లి మధురమ్మ (ఫైల్ ఫోటో)

వేదమంత్రాలు పటించే సాంప్రదాయ కుటుంబంలో పుట్టి, దర్జాగా జీవితాన్ని అనుభవించే ఆదరణ ఉన్న, వేణుగోపాల్ అణగారిన వర్గాల పట్ల ఆయన ఆవేదన చెందాడు.

శ్రీకాకుళ, నక్సల్బరి తెగించిన పోరాట పటిమ ఉన్న మల్లోజుల సోదరుల్లో చిన్న వాడైన వేణుగోపాల్ రావు తన 45 ఏళ్ల విప్లవ రహస్య జీవితాన్ని వీడుతున్నాడు. వేణు ఇంటిలో అందరిదీ ఆదర్శ జీవనం.

మల్లోజుల కోటేశ్వరరావు@కిషన్ జి (ఫైల్ ఫోటో)

తండ్రి మల్లోజుల వెంకటయ్య, తాత స్వాతంత్ర సమరయోధులు, తల్లి మధురమ్మ, కడుపున పుట్టిన ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు మావోయిస్టు పార్టీకి అంకితమయ్యారు. ఆ పార్టీ అగ్రనేత  మల్లోజుల కోటేశ్వరరావు  @ కిషన్ జి  2011 నవంబర్ బెంగాల్ లో జరిగిన ఎన్కౌంటర్ లో హతమయ్యాడు. తండ్రి వెంకటయ్య 1997 లో మృతి చెందారు. తల్లి మధురమ్మ 2022 అక్టోబర్ లో మృతి చెందింది. మరో సోదరుడు అంజయ్య పురోహితం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.