మతాలకు గౌరవం మానవత్వానికి ప్రాధాన్యం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ధ్యేయం !

👉 మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

అన్ని మతాలకు సమ గౌరవం  మానవత్వానికి ప్రాధాన్యం ఇదే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ధ్యేయం అని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని రహమత్‌నగర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్‌, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్‌, మైనారిటీ సలహాదారు మొహమ్మద్‌ అలీ షబ్బీర్‌, కార్పొరేషన్‌ చైర్మన్లు ఒబెదుల్లా కొత్వాల్‌, అజారుద్దీన్‌, మత పెద్దల సమక్షంలో కబ్రస్థాన్‌ స్థలం కేటాయింపు కు సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ…..

ముస్లింల కబ్రస్థాన్ స్థలాల (స్మశాన వాటికల స్థలాలు) కేటాయింపుతో ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం కాంగ్రెస్‌ ప్రభుత్వ చిత్తశుద్ధి, మైనారిటీల పట్ల ఉన్న కట్టుబాటుకు నిదర్శనం అని పేర్కొన్నారు.

👉 ముస్లింలకు జీవన గౌరవం ఉన్నట్లే, మరణానంతర గౌరవం కూడా ఉండాలి. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమాధి భూముల సమస్యను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిష్కరించిందంటే అది ప్రజల విశ్వాసానికి ఇచ్చిన గౌరవం, అని  మంత్రి అన్నారు.

👉 సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సామాజిక న్యాయం, మైనారిటీల అభ్యున్నతి దిశగా స్పష్టమైన మార్గాన్ని అనుసరిస్తోంది. దేశంలో బలహీన వర్గాలకు అండగా నిలిచే ఏకైక పార్టీ కాంగ్రెస్‌ మాత్రమే అని మంత్రి  వ్యాఖ్యానించారు.

👉 జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, షేక్‌పేట్‌, గోల్కొండ పరిసర ప్రాంతాల్లో స్థలాభావం ఉన్నప్పటికీ న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.

👉 హెచ్‌ఎండి‌ఏ, కలెక్టర్ల సమన్వయంతో లీగల్‌, భౌగోళిక అడ్డంకులను తొలగిస్తున్నామని వివరించారు.పాత కబ్రస్థాన్‌ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తాం. లైటింగ్‌, డ్రైనేజీ, రోడ్లు, నీటి సదుపాయాల పనులు చేపడతాం. ఆక్రమణలు జరగకుండా బౌండరీ వాల్ నిర్మాణం చేస్తాం అని ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక సమాధి భూమిని గుర్తించడమే లక్ష్యం, అని అన్నారు.

👉 ధార్మిక హక్కులను కాపాడడమే నిజమైన సెక్యులరిజం. సీఎం రేవంత్‌రెడ్డి  నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది, అని పేర్కొన్నారు.

👉 గత టీఆర్‌ఎస్‌ పాలనలో మైనారిటీల సమస్యలను నిర్లక్ష్యం చేశారని, కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకుందని మంత్రి అన్నారు. మాట ఇస్తే పని చేస్తుంది  అదే కాంగ్రెస్‌ పార్టీ విశ్వసనీయత, అని మంత్రి స్పష్టం చేశారు.

👉 తాను మైనారిటీ శాఖ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆరు మైనారిటీ కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం జరగడం ఈ ప్రభుత్వ ము మైనారిటీల పట్ల వున్న చిత్త శుద్ధి ప్రతిబింబిస్తోందన్నారు.

👉 వక్ఫ్‌ స్థలాలు, కబ్రస్థాన్‌ భూముల రక్షణకు కలెక్టర్లతో సమన్వయం కొనసాగుతోందని వివరించారు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం  మత, సాంస్కృతిక గుర్తింపును గౌరవిస్తోంది. ముస్లింల అభ్యున్నతికి ప్రత్యేక నిధులు కేటాయించి, సమాధి స్థలాల సర్వేలు, అభివృద్ధి పనులను వేగవంతం చేసింది అని మంత్రి అన్నారు.

👉 జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయించామని, రాబోయే రోజుల్లో దానిని రోల్‌ మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

👉 జూబ్లీహిల్స్‌ లో ముస్లిం మైనారిటీలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు.  ఇందిరమ్మ రాజ్యంలో  ప్రజా  ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని , ఇక ముస్లిం మైనార్టీలు కూడా కాంగ్రెస్‌పై  నమ్మకంతో ముందుకు  కొనసాగలని, అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు.