👉 జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ !
J SURENDER KUMAR,
ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని
మెటాఫండ్ పిఆర్ఓ యాప్ తో గొలుసు కట్టు వ్యాపారం పేరిట ప్రజల సొమ్ము దోచుకున్న కేటుగాళ్లను జగిత్యాల జిల్లా పోలీసులు పట్టుకొని రిమాండ్ కు తరలించారు.
👉 ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం మీడియా సమావేశంలో వివరించిన వివరాలు ఇలా ఉన్నాయి….
మెటా ఫండ్ పి ఆర్ ఓ అనే యాప్ ని సృష్టించి ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే, ₹ 3 లక్షల రూపాయలు వస్తాయని, అదేవిదంగా అధిక మందిని చేర్పిస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, విధేశీ యాత్రలు ఉచితంగా చేయవచ్చు అని గొలుసుకట్టు వ్యాపారం పేరుతో అమాయక ప్రజలను మోసగించిన వారిని అరెస్టు చేసినట్టు ఎస్పీ తెలిపారు.

జగిత్యాలకు పట్టణముకు చెందిన, కస్తూరి రాకేష్ కుమార్, ప్రజల నుండి డబ్బులు వసూల్ చేసి డబ్బులను క్రిప్టో కరెన్సీ లో ఇన్వెస్ట్ చేసి పెద్ద మొత్తం లో లాబాలను ఆశించవచ్చు అని మోసగించాడని తెలిపారు.
కస్తూరి రాకేష్ కుమార్ , కొడిమ్యాలకు చెందిన సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, . వీరబత్తిని రాజు లతో కలిసి ఉమ్మడిగా ప్రజలను మోసగించారని తెలిపారు. ప్రజల నుండి దాదాపు ₹ 20 లక్షల రూపాయలు మూడింతల లాభం వస్తుందని మరియు గోవా, సింగపూర్, దుబాయ్ వంటి దేశాలకు ఉచితంగా టూర్ పంపిస్తామని ఆశ చూపి ఎటువంటి డబ్బులు వారికి ఇవ్వకుండ మోసం చేసినట్టు ఎస్పీ అశోక్ కుమార్ వివరించారు.
మెట్ ఫండ్ యాప్ ని మూసి వేయగా, పెట్టుబడి పెట్టిన అనేక మంది బాధితులు నష్టపోయినారు. ఇందుకు గాను కొడిమ్యాల కు చెందిన బాధితురాలు పిర్యాదు మేరకు కొడిమ్యాల పోలీస్ స్టేషన్ లో వీరిపై పలు సెక్షన్ల తో కేసు నమోదు చేసి తిరుపతిరెడ్డి మరియు . రాజు లను ఈ నెల 8న అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్టు తెలిపారు.
విచారణలో భాగంగా రాకేష్ కుమార్ ను శుక్రవారం అరెస్ట్ చేసి అతడి వద్ద లాప్ ట్యాప్, లక్ష రూపాయల నగదు, బ్యాంకు పాస్ బుక్కులు, ఏటీఎం, క్రెడిట్ కార్డు లు స్వాధీన పరుచుకొని రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు.
ప్రజలు గొలుసు కట్టు వ్యాపారం పేరుతో క్రిప్టో కరెన్సీ లో ఇన్వెస్ట్ చేసి అధిక మొత్తంలో లాబాలను అందిస్తామని మరియు విదేశీ టూర్లకు పంపిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దు అని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో డిఎస్పి రఘు చందర్, మల్యాల సి.ఐ రవి, కోడిమ్యల ఎస్సై సందీప్ పాల్గొన్నారు.