మైనర్ బాలిక పై అత్యాచారం  కేసులో 20 సంవత్సరముల  జైలు శిక్ష !

👉 బాధిత బాలికకు ₹ 7 లక్షల రూపాయలు పరిహారం.!


J.SURENDER KUMAR,

కోడిమ్యాల   పోలీస్ స్టేషన్ పరిదిలోనికి చెందిన మైనర్ బాలికను నిందితుడు కటుకురి  అశోక్  వయస్సు 47   సంవత్సరాలు అనే వ్యక్తి అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడిపై  పోక్సో చట్టం కింద 2023 సంవత్సరo లో  కోడిమ్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.


అప్పటి ఇన్స్పెక్టర్ లు కృష్ణకుమార్ ,కిషోర్ రమణమూర్తి   కేసును  విచారించడం జరిగింది. రాష్ట్ర ట్రాక్ స్పెషల్ కోర్టు కు ఆధారాలు సమర్పించగా పిపి  కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షలను ప్రవేశపెట్టగా సాక్షులను విచారించిన న్యాయమూర్తి  శ్రీమతి రత్న పద్మావతి సోమవారం నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారగార శిక్ష మరియు ₹10000/- జరిమాన, బాధిత బాలికలకు ₹ 7  లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు.

ఈ సందర్బంగా ఎస్పి  మాట్లాడుతూ …  సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ వేగవంతగా  జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.

పై కేస్ లో నిందితునికి  శిక్ష పడటం  పడటం లో కృషి చేసిన పీపీ రామకృష్ణ రావు  ,ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ లు కృష్ణకుమార్ ,కిషోర్ ,రమణమూర్తి  ,CMS  ఎస్.ఐ శ్రీకాంత్ , కోర్ట్ కానిస్టేబుల్ K.V. సాగర్   మరియు CMS కానిస్టేబుల్స్ శ్రీధర్ ,కిరణ్ కుమార్ లను  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా  అభినందించారు.


👉 గొడవల నేపధ్యంలో  హత్య, ఒకరికి జీవిత ఖైదు,₹ 5000/- రూపాయల జరిమాన !

జగిత్యాల టౌన్  పోలీస్ స్టేషన్ పరిధిలోని   తోట శేకర్ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడు సామండ్ల మహేష్  అనే వ్యక్తికి జీవిత ఖైదు తో పాటు ₹5000/- రూపాయల జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి  శ్రీమతి రత్న పద్మావతి   సోమవారం తీర్పు ఇచ్చారు.

జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ వాడ కు చెందిన తోట శేఖర్ మరియు బీట్ బజార్ కి చెందిన మహేష్ కు పాత గొడవలు ఉండేవి. ఈ పాత గొడవల మనసులో పెట్టుకొని మహేష్, శేఖర్ ను ఎలాగైనా చంపాలని ఉద్దేశంతో  162023 అక్టోబర్ 16 న  రాత్రి ఒంటిగంట సమయంలో  శేఖర్ కు అతిగా మద్యం త్రాగిపించి కత్తితో పొడిచి హత్య చేయడం జరిగింది.

మృతుని  బార్య ఫిర్యాదు మేరకు జగిత్యాల టౌన్  పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి తోట శేకర్ ను  హత్య చేసిన  నిందితుడు అయన సామండ్ల మహేష్  24 yrs గా  గుర్తించి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా సాక్షులను విచారించిన తరువాత నిందితుని  పై నేరం రుజువు కావడం తో జీవిత ఖైదు తో పాటు ₹ 5000/- రూపాయల జరిమానా విధిస్తూ  న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి   ఈ రోజు తీర్పు ఇచ్చారు.

నిందితునికి  శిక్ష పడటంలో కృషి చేసిన  పీ.పీ మల్లికార్జున్ , అప్పటి ఇన్వెస్టిగేషన్ ఇన్స్పెక్టర్ లు  కిషోర్ CMS ఎస్.ఐ శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ శ్రీనివాస్ మరియు CMS కానిస్టేబుల్, M. కిరణ్ కుమార్ లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.

👉 మద్యం మత్తులో దాడి చేసిన కేసు లో నిందితుడి కి 2 సంవత్సరల జైలు శిక్ష మరియు ₹ 4200 /- జరిమాన !

జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలోని  తాటిపల్లి గ్రామంనికి చెందిన మారంపెళ్ళి లక్ష్మణ్ ను మద్యం మత్తులో బెరిగిడి  ప్రశాంత్ అనే వ్యక్తి  దాడి చేసిన ఘటన నిందితుడి కి  2 సంవత్సరల జైలు శిక్ష మరియు ₹ 4200 /- జరిమాన విధిస్తూ  న్యాయమూర్తి శ్రీమతి లావణ్య సోమవారం తీర్పు ఇచ్చారు.

జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలోని  తాటిపల్లి గ్రామంనికి చెందిన మారంపెళ్ళి లక్ష్మణ్ కూలిపని చేసుకుంటూ జీవిస్తున్నాడు.  తేదీ 2022 నవంబర్ 13 న రాత్రి   తాటిపల్లి లో గల  BC సంఘం భవనానికి వెళ్లి అక్కడ గద్దెమీద కూర్చుని ఉండగా బెరిగిడి ప్రశాంత్ s/o నర్సయ్య, వయస్సు 30 సంవత్సరాలు, తాటిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి మద్యం తాగి మత్తులో అక్కడికి వచ్చి  లక్ష్మణ్ ను తిడుతూ, కుడిచేతితో చెంప మీద కొట్టి, నా మెడ వంచి,  వీపు మీద కొట్టడం జరిగినది .అంతేకాక, తన బైక్ తో డీ కొట్టి కిందపడేసి గాయపరచడం జరిగినది. బాధితుడు గాయాలతో పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేయగా, జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో  నిందితుడు బెంగిడి ప్రశాంత్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా సాక్షులను విచారించిన తరువాత నిందితుని  పై నేరం రుజువు కావడం తో అతనికి  2    సంవత్సరాల జైలు శిక్ష,₹ 4200  జరిమాన  విధిస్తూ న్యాయమూర్తి  శ్రీమతి లావణ్య తీర్పు ఇచ్చారు.

👉 మైనర్ బాలిక పై అత్యాచారం  కేసులో నిందితునికి  10 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు ₹25,000 /- జరిమాన!

కోడిమ్యాల   పోలీస్ స్టేషన్ పరిదిలోనికి చెందిన మైనర్ బాలికను నిందితుడు లంక దాసరి మల్లేశం  వయస్సు 30   సంవత్సరాలు అనే వ్యక్తి అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడిపై  పోక్సో చట్టం మరియు SC/ST అట్రాసిటీ చట్టం కింద 2021 సంవత్సరo లో  కోడిమ్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

అప్పటి డిఎస్పి ప్రకాష్  కేసును దర్యాప్తు చేసి  కోర్టు కి ఆధారాలు సమర్పించగా పిపి  కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షలను ప్రవేశపెట్టగా సాక్షులను విచారించిన  న్యాయమూర్తి   నారాయణ సోమవారం నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారగార శిక్ష మరియు ₹25,000/- జరిమాన విధిస్తూ తీర్పునిచ్చారు.

పై కేస్ లో నిందితునికి  శిక్ష పడటం  పడటం లో కృషి చేసిన పీపీ మల్లేశం గౌడ్ ,ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిఎస్పి ప్రకాష్, CMS  ఎస్.ఐ శ్రీకాంత్ , కోర్ట్ కానిస్టేబుల్ K.V. సాగర్   మరియు CMS కానిస్టేబుల్స్ రాజు నాయక్ , M.కిరణ్ కుమార్ లను  జిల్లా  అశోక్ కుమార్ ప్రత్యేకంగా  అభినందించారు.