J.SURENDER KUMAR,
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి, కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం పరామర్శించారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి తల్లి కాంతమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని కాంతమ్మ చిత్రపటానికి పువ్వులు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవ రెడ్డి తో పాటు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
హనుమకొండ జిల్లా వడ్డేపల్లిలో జరిగిన కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎంపీలు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
👉 వైస్ చైర్మన్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డిని ఆయన కుటుంబ సభ్యులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం రాత్రి పరామర్శించారు.
పురపాటి రాజిరెడ్డి తండ్రి పురపాటి గంగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మండలంలో శ్రీరాముల పల్లెలో రాజిరెడ్డి ఇంటికి మంత్రి వెళ్లి గంగారెడ్డి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.

👉 ఫర్నిచర్ షాప్ ప్రారంభించిన మంత్రి !

జగిత్యాల పట్టణంలోని చల్గల్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో మహా ఫర్నిచర్ షాప్ ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ యాజమాన్యానికి మంత్రి శుభాకాంక్షలు తెలుపుతూ వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.