J SURENDER KUMAR,
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మైనారిటీల విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి ముస్లిం మైనారిటీ విద్యార్థి కూడా ఉన్నత స్థాయిలో నిలవాలని ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా మైనారిటీ విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డలో మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను సహచర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ తో కలిసి ఆదివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….
పేద, మధ్యతరగతి ముస్లిం కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్య అందించే దిశగా ఎర్రగడ్డలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనతో ఈ అత్యాధునిక సదుపాయాలతో కళాశాలను మనం ఈరోజు ప్రారంభించుకున్నామని అన్నారు.
👉 ఈ కళాశాల తెలంగాణ మైనారిటీల విద్యా పునరుజ్జీవనంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. విద్య అనేది సామాజిక సమానత్వానికి, ఆర్థిక స్వావలంబనకు ప్రధాన శక్తి మైనారిటీ విద్యార్థులు కూడా IIT, NIT, AIIMS వంటి సంస్థల్లో స్థానం సంపాదించాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష అని మంత్రి అన్నారు.
👉 ఈ దిశగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COEs) ఏర్పాటు ద్వారా మైనారిటీలకు సమాన స్థాయి పోటీ శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. COE ల ద్వారా విద్యార్థులకు IIT-JEE, NEET, CLAT, NDA, CUET వంటి జాతీయ స్థాయి పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ అందుతోంది అని స్పష్టం చేశారు.

👉 ప్రతి మైనారిటీ విద్యార్థి ఉన్నత లక్ష్యాలపై దృష్టి పెట్టేందుకు అవసరమైన వసతి, భోజనం, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, లైబ్రరీ వంటి సదుపాయాలు కల్పించబడ్డాయి. COE ల ద్వారా మైనారిటీ విద్యార్థుల ప్రతిభ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది గత రెండేళ్లలో మైనారిటీ విద్యార్థుల్లో NEET, JEE, NDA లలో రికార్డు స్థాయిలో సీట్లు సంపాదించారు అని మంత్రి అన్నారు.
👉 ఈ ఫలితాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యా దృక్పథానికి ప్రతిబింబం రాష్ట్రంలో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు 205కి పెరిగి, దాదాపు 1.33 లక్షలకు పైగా విద్యార్థులు ఇప్పుడు చదువుకుంటున్నారుఅని అన్నారు.
👉 ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మన మైనారిటీ విద్యాలయాల్లో సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.ఎర్రగడ్డ కళాశాల అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ బోర్డులు, సైన్స్ ప్రాక్టికల్ ఫెసిలిటీస్‌తో ఏర్పాటు చేశాం అన్నారు.
👉 మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు తెలంగాణ గురుకుల COE ల ద్వారానే వెలుగొందుతుంది సాంకేతిక విద్య, మానవతా విలువలు, సృజనాత్మకత ఈ మూడు ఆధారాలపై ప్రభుత్వ విద్యా వ్యూహం కొనసాగుతోంది అని అన్నారు.
👉 ప్రతి పేద మైనార్టీ కుటుంబాల పిల్లలలో ఉన్న ప్రతిభను గుర్తించి సరైన దిశలో మలచడం ఈ ప్రభుత్వ ప్రత్యేకత అని పేర్కొన్నారు సదుపాయాల పరంగా తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ వ్యవస్థ దేశంలోనే ఆదర్శమని తెలిపారు.
👉 ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో మైనారిటీ విద్యా బడ్జెట్ 40 శాతం పెంచాం. ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం ఒక COE ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
👉 విద్య ద్వారా మైనారిటీల సాధికారతే నిజమైన అభివృద్ధి అని మంత్రి అన్నారు.ముస్లిం అమ్మాయిల విద్యపై ప్రత్యేక దృష్టితో వసతి గృహాల అభివృద్ధికి కూడా భారీ నిధులు కేటాయించినట్లు చెప్పారు.

👉 ప్రొఫెషనల్ కోర్సులలో మైనారిటీ విద్యార్థుల ప్రవేశం గతంతో పోలిస్తే 22% పెరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయన్నారు
మైనారిటీ విద్యార్థులు ప్రభుత్వ రంగంలో, టెక్నాలజీ రంగంలో, సివిల్ సర్వీసెస్‌లో గణనీయ స్థాయిలో ఎదగడం సంతోషకరమని పేర్కొన్నారు. విద్య ద్వారా సమాజం ముందుకు సాగాలి అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఎర్రగడ్డ కళాశాల ప్రారంభం మైనారిటీ విద్యార్థుల ఆశయాలకు నూతన ఆశాకిరణం అవుతుందని మంత్రి అన్నారు.
👉 ప్రతి మైనారిటీ విద్యార్థి ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం అన్ని వనరులను సమకూరుస్తోంది. COEs ద్వారా తెలంగాణ మైనారిటీల ప్రతిభ జాతీయ స్థాయికి చేరుకుంటోంది. ఇది విద్య ద్వారా సాధ్యమవుతున్న నిజమైన సామాజిక సమానత్వం.” అని మంత్రి స్పష్టం చేశారు.