J SURENDER KUMAR,
తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజావరోహణం తో ముగిశాయి. రాత్రి 7 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. అనంతరం ధ్వజావరోహణంతో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి,టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, సివిఎస్ఓ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.