J.SURENDER KUMAR,
గోదావరిఖని పట్టణ కేంద్రానికి చెందిన అడ్డల రామస్వామి తండ్రి అడ్డల రాజయ్య అనారోగ్యంతో మృతి చెందారు.
రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం గోదావరిఖనిలోని వారి నివాసానికి వెళ్లి రాజయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

👉 రామగిరి మండలంలో..

ఎండపెల్లి మండలం రాజారంపల్లి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సోమిశెట్టి రమేష్ తండ్రి మల్లయ్య ఇటీవల మరణించగా, వారి సొంత గ్రామం రామయ్యపల్లె (రామగిరి మండలం) లో నిర్వహించిన కర్మ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
👉 ధర్మపురి మండలంలో..

ధర్మపురి పట్టణానికి చెందిన రొట్టె శ్రీనివాస్ తండ్రి రొట్టె బాల కిష్టయ్య, మండలం తిమ్మాపూర్ గ్రామ వాస్తవ్యులు శాతాల్ల నారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
