నాడు నేడు బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ సాక్షిగా!

👉 నాడు ధర్మపురిలో..నేడు హైదరాబాదులో..

J.SURENDER KUMAR,

ఏ నిమిషానికి ఏమి జరగనున్నదో ?  ఎవరు ఊహించెదరో ?  అని ఓ రచయిత పాట అక్షర సత్యం గా అనిపిస్తుంది.

వివరాల్లోకి వెళ్తే…

కాంగ్రెస్, టిఆర్ఎస్ రాజకీయ నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో చోటు చేసుకున్న  సంఘటనలకు  భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాక్షిభూతమయ్యారు.

మాజీ మంత్రి హరీష్ రావు, క్యాబినెట్ సమావేశంను దండుపాళ్యం అంటూ ఆరోపణ చేయడం, ప్రతిగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, హరీష్ రావుకు ప్రతి సవాల్  చేయడంతో పాటు చర్చకు సిద్ధమా అని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

సోమవారం హైదరాబాదులో అంబేద్కర్ విగ్రహం వద్దకు మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, తన అనుచరులతో చర్చకు రావడం, పోలీసులు అడ్డుకొని వారిని వాహనంలో ఇతర ప్రాంతానికి  తరలించిన విషయం తెలిసిందే.

👉 2023 లో..

ధర్మపురి  అసెంబ్లీ పరిధి పాశిగమ గ్రామంలో ఇత్తనాలు ఫ్యాక్టరీ ఏర్పాటుతో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడతాయని బిఆర్ఎస్ ప్రభుత్వంలో నాటి ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ధర్నాలు, ఆందోళనలు చేశారు.

పర్యావరణ తదితర అనుమతులు చూపాలని డిమాండ్ చేశారు. నాటి  ప్రభుత్వం లో పోలీసులు లక్ష్మణ్ కుమార్ పట్ల  దురుసుగా ప్రవర్తిస్తూ అరెస్టు చేసి ఇతర ప్రాంతాల పోలీస్ స్టేషనుకు తరలించారు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు లక్ష్మణ్ కుమార్ నిరసన చేపట్టారు. ఈ నిరసనను జీర్ణించుకోలేని నాటి ప్రభుత్వం దౌర్జన్యంగా అరెస్టు చేసి ఇతర ప్రాంత పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఏ నిమిషానికి ఏమి జరగనున్నదో ?  ఎవరు ఊహించెదరో ?  అని ఓ రచయిత పాట ఈ సందర్భాలతో   అక్షర సత్యం గా అనిపిస్తుంది.