నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టండి !

👉 మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ సజావుగా జారీ చేయాలి !

👉 స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని !

J SURENDER KUMAR,

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని జిల్లా కలెక్టర్ లతో బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాజా గౌడ్ లతో  కలిసి పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ…

ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 9న ఉదయం 10.30 గంటల వరకు విడుదల చేయాలన్నారు.

👉 నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు ఎంపీటీసీ జడ్పిటిసి పరిధిలోని ఓటరు జాబితా వివరాలను ప్రచురించాలని తెలిపారు.

👉 అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 11 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలని అన్నారు.

👉 ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాలకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు వద్ద నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని,  ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద పూర్తి స్థాయి బందోబస్తు కల్పించాలని అన్నారు.

👉 నామినేషన్ల పరిశీలన నవంబర్ 12 న సాయంత్రం 5 గంటల వరకు పూర్తి చేసి చెల్లుబాటైనా నామినేటెడ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలన్నారు.

👉 అప్పిళ్ళ

అభ్యర్థుల జాబితా పై అప్పిళ్ళ కోసం నవంబర్ 13 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుందని, నవంబర్ 14 నాడు ఆపిళ్ళ పరిష్కరించాలని, నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంటుందని, అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రచురణ చేయాలని అన్నారు .

👉 నామినేషన్ల స్వీకరణ, పరిశీలన,అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు,  పోటి చేసే అభ్యర్థుల ప్రకటన  పకడ్బందీగా జరిగేలా అవసరమైన మార్గదర్శకాల జిల్లా ఎన్నికల అధికారులు జారీ చేయాలని అన్నారు.

👉 జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ..

మొదటి విడత జిల్లాలో ఎంపిటిసి,  జడ్పిటిసి స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు.

👉 రిటర్నింగ్ అధికారులకు, ఇతర సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు.

👉 ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి పంపిణీ పూర్తయిందని, నామినేషన్ కేంద్రాల వద్ద అవసరమైన భద్రత  కల్పించామని అన్నారు.

👉 జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహించేందుకు పట్టిష్ట చర్యలు చేపట్టడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ రాజా గౌడ్, జెడ్పీ సిఈఓ గౌతమ్ రెడ్డి,  డిపిఓ మదన్మోహన్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.