నామినేషన్ పత్రాల అవగాహనా శిక్షణ సమావేశం!

J. SURENDER KUMAR,

స్థానిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ పత్రాలకు సంబంధించిన అవగాహనా శిక్షణ సమావేశం జగిత్యాల జిల్లా కలెక్టర్ నిర్వహించారు. జగిత్యాల పట్టణంలో  S.K. N. R డిగ్రీ కాలేజ్ లో  ఎన్నికలలోపోటీ చేయు అభ్యర్థుల నామినేషన్ పత్రాలకు సంబంధించి ఆర్వో, ఏఆర్వో లకు  కలెక్టర్ సోమవారం అవగాహన కల్పించారు.

👉 ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ….

ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి స్థానిక ఎన్నికల్లో ఎలాంటి లోటుపాట్లు జరుగకుండా, నిబద్ధతతో, క్రమశిక్షణతో ఎన్నికలు నిర్వహించాలని అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. రాజాగౌడ్, సంబంధిత అధికారులు, ఆర్వో, ఏ ఆర్వో లు పాల్గొన్నారు.