👉 తెలుగు విశ్వ విద్యాలయ పక్షాన !
J SURENDER KUMAR,
ధర్మపురి కి చెందిన ఒజ్జల నరహరి శర్మ కు ధర్మపురి వైభవం కావ్య రచన ప్రక్రియలో తెలంగాణ లో ఉత్తమ “పద్య కవిత” సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వ విద్యాలయ ఆధ్వర్యంలో 2023 తెలంగాణ ఉత్తమ సాహితీ పురస్కారాల్లో భాగంగా బుధవారం జరిగిన సాహితీ పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమంలో ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు, వెలుగొండ నిత్యానందరావు , ఆంధ్ర తెలుగు యూనివర్శిటీ ఉపాధ్యక్షులు మునిరత్నం నాయుడు, ఆకాశవాణి హైదరాబాద్ డైరెక్టర్ రమేష్, రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు, కవులు, రచయితలు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
👉 పురస్కార గ్రహీత ఒజ్జల నరహరి శర్మ గూర్చి..

ధర్మపురి శ్రీ వేంకటేశ్వర సంస్కృత పాఠశాలలో పూర్తి చేసుకున్నారు. ప్రముఖ సంస్కృత తర్క వేద పండితుడు, స్వర్గీయ బ్రహ్మశ్రీ తాడూరి బాలకృష్ణ శాస్త్రి వద్ద సంస్కృత, తర్కవిద్యను అభ్యసించారు.
హైదరాబాదు వేదాంతవర్దిని సంస్కృత కళాశాలలో సంస్కృత విద్యను, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృతము తెలుగు భాషలలో స్నాతక విద్య ఎం.ఎ. పట్టాలు పొందారు.
1992 లో కాకతీయ విశ్వవిద్యాలయం ఉపాధ్యాయ శిక్షణ (బి ఈడి) పూర్తి చేశారు.
1966 లో ఉపాధ్యాయ వృత్తిలో చేరిన నరహరి శర్మ. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ గా 2006 వరకు విధులు నిర్వహించారు. విద్యార్థి దశలోనే దత్తాత్రేయ సుప్రభాతాన్ని, పంచరత్నాలు అనే ఖండికను తెలుగులో అనువదించారు.
దేవాదాయ శాఖ వారు నేటికీ నిర్వహిస్తున్న ఆరాధన మాసపత్రిక సంపాదమండలి సభ్యులుగా 10 సంవత్సరాలు సేవలను అందించారు. ఆంధ్రప్రదేశ్ దేవదాయ ధర్మదాయ శాఖ వారు నిర్వహించిన అనేక పరీక్షలలో నిర్వాహక సభ్యుడిగా పాఠ్య ప్రణాళిక సభ్యుడిగా సేవలందించారు.
