👉 మంత్రులు శ్రీధర్ బాబు, కొండ సురేఖలు ధర్మపురికి రాక !
J.SURENDER KUMAR,
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆదివారం సాయంత్రం నిర్వహించనున్న ప్రవచన కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, కొండా సురేఖల పాల్గొననున్నారు.ప్రవచన కార్యక్రమాన్నికి ముందు మంత్రి కుమారుడు హరిశ్వర్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించిన ధర్మపురి ఆలయ డాక్యుమెంటరీ ప్రోమోను, చాగంటి కోటేశ్వరరావు విడుదల చేయనున్నారు.
ఆదివారం ఉదయం 8 గంటలకు చాగంటి కోటేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు శ్రీ మఠం మైదానంలో ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు.