👉 విస్తృత ఏర్పాట్లు చేస్తున్న దేవాదాయ శాఖ !
👉 రెండు రోజులపాటు ప్రవచనం !
👉 వేదిక గోదావరి తీరం శ్రీ మఠం మైదాన ప్రాంగణం !
J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, శనివారం మధ్యాహ్నం 12 గంటలకు రానున్నారు నంది విగ్రహం నుండి సాంప్రదాయ పద్ధతిలో క్షేత్ర వాసులు స్వాగతం పలకనున్నారు.

ప్రవచనం జరగనున్న గోదావరి నది తీరం శ్రీ మఠం మైదాన ప్రాంగణంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రవచన నిర్వహణ వేదిక, వేదికలను శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నయి. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

క్షేత్రంలో స్వాగత తోరణాలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ప్రవచనం వినడానికి భారీ సంఖ్యలో భక్తజనం తరలి వస్తారని అధికార యంత్రాలు అంచనా వేస్తున్నది.