నేడు ధర్మపురిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఖండ !


J.SURENDER KUMAR,

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ధర్మపురి పట్టణ పుర విధుల్లో స్వయం సేవకుల పథ సంచలన్  (రూట్ మార్చ్)  జరగనున్నది.

నగరంలోని న్యూ టీటీడీ మండపం నుండి  ప్రారంభమై గాంధీ విగ్రహం, సర్దార్ పటేల్ విగ్రహం, తెనుగువాడ గద్దె, బ్రాహ్మణ సంఘం, స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ముందు నుండి నంది కూడలి, అంబెడ్కర్ విగ్రహం, ఇందిరమ్మ కాలనీ, కశెట్టి వాడ, శివాజీ విగ్రహం, నంది విగ్రహం  బస్ స్టాండ్ మీదుగా  సంచలన్ ముగుస్తుంది.

ఘనవేశ్ (శాఖ యూనిఫాం) ఉన్నవాళ్లు అందరు ధరించి  ఉదయం 10 – 00 గంటల కు న్యూ టీటీడీ మంటపానికి చేరుకొవాలి అని ధర్మపురి ఆర్ఎస్ఎస్ శాఖ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.