J.SURENDER KUMAR,
ప్రజా నాయకుడు, సర్పంచ్ స్థాయి నుండి రాజకీయంలో అంచలంచలుగా ఎదుగుతూ. ఉమ్మడి రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా సేవలు అందించిన మాజీమంత్రి జువ్వాడి రత్నాకర్ రావు నేడు ( శనివారం) 98 జన్మదినం
ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ గా, ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర తెలుగు కళాశాల పాలకవర్గ, ధర్మపురి ఆలయ పాలకవర్గ , జగిత్యాల పంచాయతీ సమితి అధ్యక్షుడిగా, కొనసాగిన, రత్నాకర్ రావు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా,1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన జువ్వడి రత్నాకర్ రావు, స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో, దేవాదాయ ధర్మాదాయ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఉమ్మడి రాష్ట్రంలో ధూపదీప నైవేద్యం పథకానికి సంబంధించిన ఫైల్ పై జువ్వడి రత్నాకర్ రావు తొలి సంతకం చేశారు.
విద్యా, వైద్యం ,సాగు, తాగు నీరు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఆయన హయంలో జరిగిన అభివృద్ధి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రత్యక్ష నిదర్శనంగా అగుపిస్తుంది. మాజీ మంత్రి రత్నాకర్ రావు అభిమానులు, కార్యకర్తలు, ధర్మపురి పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించనున్నారు.