J SURENDER KUMAR,
హైకోర్టు ప్రముఖ సీనియర్ న్యాయవాది, బుచ్చిబాబు@ బుచ్చిరెడ్డి కి రాష్ట్ర రెడ్డి జేఏసీ అధ్యక్షు డు అప్పమ్మగారి రాంరెడ్డి, రాష్ట్ర కో చైర్మన్ పైళ్ళ హరినాథ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 42 శాతం రిజర్వేషన్ లు, జీవో, నోటిఫికేషన్ పై హైకోర్ట్ స్టే ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో గురువారం రాత్రి, న్యాయవాది బుచ్చిబాబు ను ఆయన చాంబర్ లో కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో రెడ్డి జేఏసీ నాయకులు ఘనంగా సన్మానించారు.
రెడ్డి జేఏసీ పిటిషన్ దార్లు పక్షాన హైకోర్టు లో సెప్టెంబర్ 27 న న్యాయవాది బుచ్చిరెడ్డి, లంచ్ మోషన్ లో W P NO 30274/2025 పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో న్యాయవాది బుచ్చి రెడ్డి తన వాదనలు వినిపిస్తూ , సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను, రాజ్యాంగంలోని నిబంధనలు, వివిధ రాష్ట్రాలలో రిజర్వేషన్లు అమలవుతున్న తీరును, ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 , నోటిఫికేషన్ జారీ తదితర అంశాలలోని పొరపాట్లను హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు బుచ్చిరెడ్డి బలంగా వాదనలు వినిపించారు.

హైకోర్టు ధర్మాసనం, న్యాయవాది వాదనలోని అంశాలను పరిగణ లోకి తీసుసుకుని ప్రభుత్వం రిజర్వేషన్ లపై తీసుకువచ్చిన 42%,
మరియు ఎలక్షన్ నోటిఫికేషన్ జారీని నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర రెడ్డి JAC ప్రక్షాళ నాయకులు పిట్ట శ్రీనివాస్ రెడ్డి, కొట్టం మధుసూదన్ రెడ్డి, తుమ్మల మధుకర్ రెడ్డి న్యాయవాది నందికంటి వినీలరెడ్డి ,ఉత్తర తెలంగాణ అధ్యక్షులు పెండ్యాల రాంరెడ్డి తదితర నాయకులు బుచ్చిరెడ్డి నీ కలిసి అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.