అక్టోబర్ 31 న కాశీ క్షేత్రంలో ధర్మపురి నరసింహుడి కళ్యాణం!

J SURENDER KUMAR,

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రముఖ కాశి క్షేత్రంలో ఈనెల 31 న ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం జరగనున్నది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ శాఖ ఉత్తరప్రదేశ్ లో నీ కాశి క్షేత్రంలో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ నిర్వహణకు అనుమతి జారీ చేసింది.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం (ఫైల్ ఫోటో)

ఆలయ కార్య నిర్వహణ అధికారి, సిబ్బంది, అర్చకుడు, వేద పండితుడు, పాలకవర్గం మంగళవారం స్వామివారి ఉత్సవమూర్తులతో ధర్మపురి నుండి కాశి క్షేత్రానికి వెళ్లనున్నట్టు సమాచారం.

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణం, భద్రాచలం శ్రీ కోదండ సీతారామ కళ్యాణం, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం, దేవాదాయ శాఖ  అనుమతించిన తేదీలలో జరగనున్నాయి.