పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం ధర్మపురి !

👉 భగవంతుడు ఏదో రూపంలోఉన్నాడు !

👉 బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనంలో..

J.SURENDER KUMAR,

పూర్వజన్మ సుకృతం ఉంటేనే, ఈ క్షేత్రంలో అడుగుపెట్టే మహా అదృష్టం మానవులకు ఉంటుందని, అలాంటి పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో అడుగుపెట్టే అదృష్టం నాకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్పించాడు అని నేను భావిస్తున్నాను. నా జన్మకు ఇంతకంటే మహాభాగ్యం ఏదీ లేదు అని, ప్రవచన చక్రవర్తి  బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనంలో అన్నారు.

ధర్మపురి క్షేత్రంలోని శ్రీ మఠం మైదాన ప్రాంగణంలో శనివారం సాయంత్రం బ్రహ్మశ్రీ చాగంటి, ప్రవచనంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ బి సత్యప్రసాద్ దంపతులు, మంత్రి తనయుడు హరీశ్వర్ కుమార్ తో పాటు వేలాదిమంది భక్తులు ఆలకించారు.

👉 ధర్మపురి క్షేత్రానికి ధర్మానికి అనుసంధానం !

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు  ప్రవచనంలో ప్రధానంగా ధర్మం గురించి ప్రస్తావిస్తూ, ధర్మాన్ని ధర్మపురికి అనుసంధానం చేస్తూ, ముఖ్యంగా ధర్మపురి వాసుల అదృష్టం గుర్తు చేస్తూ ధర్మబద్ధంగాజీవనం తో యమధర్మరాజు బారిన పడకుండా నిత్యం నరసింహ నామ స్మరణ తో  తరించాలని శనివారం ధర్మపురి వేదికగా భక్తులందరికీ  ఆధ్యాత్మిక  ప్రవచనంలో వివరించారు.

ఈక్షేత్రంలో వెలసిన యమధర్మరాజు,ధర్మాన్ని ఆచరించే వారి పట్ల ఎల్లవేళలా కరుణాకటాక్షాలు ప్రసాదిస్తాడని, చాగంటి వివరించారు. ధర్మబద్ధ జీవన విధానాన్ని అలవర్చుకునే ఆధ్యాత్మిక ధర్మపురి ధార్మిక క్షేత్రం అని అన్నారు.

👉 పరమ పవిత్రమైన నది గోదావరి నది !

ధర్మపురి క్షేత్రాన్ని ఓర్సుకుంటూ ప్రవహిస్తున్న గోదావరినది, పరమ పవిత్రమైన జీవనది అని గోదావరి నది ప్రవహించే ప్రాంతమంతా పవిత్రత సంతరించుకుని ఉందని చాగంటి పేర్కొన్నారు.

👉 భగవంతుడు ఏదో రూపంలోఉన్నాడు…

ఈక్షేత్ర వాసి మహాకవి శేషప్ప తన శతకంలో భగవంతుడు ఏదో రూపంలో ఉన్నాడు అని  నిరూపించాడు అంటూ చాగంటి వివరించారు.

👉” అడవి ప్రక్షులకు ఎవ్వడు ఆహారం ఇచ్చెను.. మృగ జాతికి ఎవ్వడు మేత పెట్టే… స్త్రీల గర్భమున శిశువును ఎవ్వడు పెంచే ….?  వన చరదులకు భోజనం ఎవరు ఇచ్చే…?   జీవకోట్లను పోషింప నీవే కానీ వేరే దాత లేదయ్య వెతికి చూడ.. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాసం దుష్ట సమహర నరసింహ దురితదూర ”

👉 ఓ నరసింహస్వామి అడవిలోని పక్షులకు ఆహారము, మృగజాతికి ఎవడు మేత .. చెట్లకు ఎవడు నీళ్లు పోసి పెంచె.. స్త్రీల గర్భములో శిశువులను ఎవరు పెంచారు..  పశువులకు పచ్చ గడ్డి పెట్టి పోషించింది ఎవ్వడు.. అతడే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దాత తప్ప మరొకరు లేరు ఉండరు అంటూ శేషప్ప శతకంలోని భావమును చాగంటి తన ప్రవచనములో సులభ శైలిలో భక్తులకు వివరించారు.

👉 చాగంటిని సన్మానించిన మంత్రి, కలెక్టర్ !

చాగంటి మొదటి రోజున తన ప్రవచనం ముగించగానే సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు, మంత్రి తనయుడు హరిశ్వర్ కుమార్, చాగంటి కోటేశ్వరరావును శాలువాను కప్పి, పూలమాలవేసి పాదాభివందనం చేసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ చాగంటితో ముఖ్యమంత్రితో అత్యవసర సమావేశ నేపథ్యంలో సకాలంలో రాలేకపోయాను అంటూ వివరణ ఇవ్వగా, చాగంటి నవ్వుతూ నేను అర్థం చేసుకోగలను అంటూ మంత్రి భుజం తట్టారు. వేలాదిమంది భక్తజనం కు ఎలాంటి అసౌకర్యలు కలగకుండా రామ్ నర్సింహారెడ్డి నేతృత్వంలో పోలీస్ బలగాలు కృషి చేశారు.

👉 చాగంటి కి ఘన స్వాగతం..



ప్రవచన చక్రవర్తి  బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శనివారం పగలు ధర్మపురికి చేరుకున్నారు.  ఆయనకు, వేద పండితులు, మహిళలు, ఆలయ అర్చకులు శ్రీలక్ష్మీ నర సింహ స్వామి పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలు, మేళ తాళాలతో పాటు, మహిళలు మంగళహారతులతో  ఘన స్వాగతం పలికారు.

👉 సామాన్యుడిలా చాగంటి రాక !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా క్యాబినెట్ హోదా గల ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, సామాన్యుడిలా తన కుటుంబ సభ్యులతో కలిసి 16 సీట్లు గల వాహనంలో ధర్మపురి కి చేరుకున్నారు. ఎలాంటి కాన్వాయ్  పోలీస్ బందోబస్తు వాహనశ్రేణి లేకుండా, ఆయన ధర్మపురి పోలీస్ పరిధిలోకి రాగానే రూట్ మ్యాప్ కోసం  ఒకే ఒక పోలీస్ వాహనం ఆయన వ్యాన్ ముందు దారి చూపుతూ వచ్చింది.