పోలీస్ అమరవీరులారా మీకు శతకోటి వందనాలు !

👉 ధర్మపురిలో కానిస్టేబుల్  కోమల్ రెడ్డిని హతమార్చి  వార్ వర్గ శత్రు నిర్మూలనకు శ్రీకారం చుట్టారు !.

👉 ల్యాండ్ మైన్స్ తోను మొదటి ప్రయోగం వికటించి 14 మంది అమాయకులు హతమయ్యారు.

👉 పోలీస్ అమరవీరుల దినోత్సవ సందర్భంగా..

J.SURENDER KUMAR,

పీపుల్స్ వార్ ఉద్యమానికి ఆటంకాలు కల్పిస్తూ అడ్డు వస్తున్న, పోలీసులను, పోలీస్ అధికారులను, ఎన్కౌంటర్లలో పాల్గొన్న పోలీసులను సైతం వర్గ శత్రువులగా, తీర్మానించి వారిని హతమార్చడానికి  1985 లో రిజర్వ్డ్ కానిస్టేబుల్ కోమల్ రెడ్డిని ధర్మపురిలో హతమార్చి శ్రీకారం చుట్టారు. పీపుల్స్ వార్  వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య ను ఉస్మానియా ఆస్పత్రి నుంచి తప్పించడానికి కాపలా గాఉన్న కానిస్టేబుల్ మహమ్మద్ ఇబ్రహీం ఖాన్ను నక్సలైట్లు హతమార్చారు..

దేశంలో అక్టోబర్ 21న పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటారు. విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించి వీర మరణం పొందిన పోలీసులను స్మరించుకోవడానికి వారి కుటుంబాలను సన్మానించుకోవడానికి ఈరోజుకు ప్రత్యేకత.

👉 నక్కల పేట ఎన్కౌంటర్ లో పాల్గొన్న కానిస్టేబుల్ కోమల్ రెడ్డి కాల్చివేతకు …

పీపుల్స్ వార్ నక్సల్స్ కార్యకలాపాలు ఉధృతంగా ఎగిసిపడుతున్న తరుణంలో ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధి, జైన గ్రామానికి చెందిన నక్సలైట్ తుమ్మ లక్ష్మీ నరసయ్య , పోలీసులకు మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ .  1985  మే  25 న  చిన్న నక్కల పేట .గ్రామ పరిసరాల్లో, ఓ ఇంటిలో  లక్ష్మీ నరసయ్య ఉన్నట్టు  ఖచ్చితమైన సమాచారం పోలీసులకు అందింది.

చడీ చప్పుడు కాకుండా పోలీసు బృందం ఆ ఇంటిని చుట్టుముట్టారు.  తమ ఇంటి చుట్టూ పోలీస్ వలయం మాటు వేసి ఉన్న విషయం గమనించి  నక్సలైట్ లక్ష్మి నరసయ్య,  కొన్ని గంటల పాటు నిశ్శబ్దంగా ఆ ఇంట్లోనే  ఉన్నాడు. 

పోలీసులు లొంగి పొమ్మని పదే పదే  లక్ష్మీ నరసయ్యను హెచ్చరించారు.  ఈ దశలో లక్ష్మీ నరసయ్య,  చాకచక్యంగా  తన వద్ద ఉన్న ఆయుధంను, తనతో  పాటు మా ఇంట్లో ఉన్న  జైన గ్రామానికి చెందిన గుడ్ల నారాయణ , అనే వ్యక్తికి  తుపాకీ అప్పగించి, ‘పోలీసులు చుట్టుముట్టారు, నీవు ఇంటి వెనుక వైపు నుంచి ఈ ఆయుధంతో పారిపో,  నేను పోలీసులతో పోరాడుతాను ‘. అంటూ నారాయణను, లక్ష్మీ నరసయ్య ఇంటి వెనుక  వైపు నుంచి బయటకు పరిగెత్తించాడు.

ఆయుధంతో పరుగెడుతున్న, అమాయకుడు నారాయణ ను   పోలీసులు నక్సలైట్ అనుకొని అతని చేతిలో ఆయుధం (తుపాకీ ) ఉండటంతో పోలీసులకు అతడే నక్సలైట్, లక్ష్మీ నరసయ్య అనుకొని  ( అంత వరకు లక్ష్మీనరసయ్య ఫోటో గాని , కదలిక గాని పోలీసులకు తెలియదు) లక్ష్మీ నరసయ్యది మండలంలోని జైన గ్రామం.  (కొత్తగూడెంలో విద్యాభ్యాసం చేశాడు) .లొంగి పొమ్మని పోలీసులు హెచ్చరించిన వినక పోవడంతో పోలీసుల ఫైరింగ్ మొదలు పెట్టారు నారాయణ మృతి చెందాడు.

ఇంటికి మరో దారి గుండా లక్ష్మీ నరసయ్య తప్పించుకొని పారిపోతుండగా, స్పెషల్ పార్టీ కి చెందిన ఇద్దరు పోలీసులు కోమల్ రెడ్డి,  దేవేందర్ రెడ్డిలు, నక్సలైట్ లక్ష్మీ నరసయ్యను  వెంటాడారు.  ఒకరి వెంట ఒకరు పంటచేలలో పరుగులు  పెట్టారు.  దాదాపు ఐదారు కిలోమీటర్లు దూరం గోదావరి నది, వైపు పరుగులు తీశారు. సాయంత్రం వేళ పశువులు, గ్రామాల్లో కి తిరిగి వస్తున్న సమయంలో  ,పశువుల మందను అడ్డుపెట్టుకొని గోదావరి నది గుండా లక్ష్మీనరసయ్య  తప్పించుకున్నాడు.

👉 ఎన్కౌంటర్లో పాల్గొన్న కానిస్టేబుల్స్ కోసం …

తనను వెంటాడిన పోలీసుల కదలికలపై కొన్ని రోజుల పాటు, ధర్మపురి పట్టణంలో వార్ రెక్కీ నిర్వహించింది.  కానిస్టేబుల్స్ కదలికలను నిర్ధారించుకున్నారు. నక్సలైట్,  లక్ష నరసయ్య, తనతో పాటు మరో నక్సలైట్, ఖదీర్ ను  వెంటబెట్టుకొని బస్టాండ్ లో  ( గతంలో బస్సులను నిలిచిన చోటు )  సాయంత్రం వేళ  ఓ హోటల్ లో  గోదావరి స్నానానికి వచ్చిన భక్తులవలె, టీ తాగుతూ తమ టార్గెట్ కోసం  వేచి ఉన్నారు. 

1985, జూలై 23 న   తనను వెంటాడిన ఇద్దరు కానిస్టేబుల్స్  కోసం ఎదురు చూస్తున్నారు.  ( పక్కనే ఓ పాన్ డబ్బా ఉంది,   పాన్ డబ్బా వద్ద కానిస్టేబుల్ కోమల్ రెడ్డి  పాన్ తీసుకుంటున్నాడు, టీవీఎస్  వాహనంపై పాన్ డబ్బా వద్దకు వచ్చి వాహనం పై నే ఉండి పాన్ కట్టించుకున్నాడు)  నక్సలైట్లు  తుమ్మ లక్ష్మీనరసయ్య , ఖదీర్, కానిస్టేబుల్  కోమటిరెడ్డికి, ఎదురుగా వెళ్లి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. కోమల్ రెడ్డి అక్కడికక్కడే కుప్పకూలాడు. కోమల్ రెడ్డి రక్తాన్ని ,చేతుల్లో తీసుకుని గాల్లోకి ఎగరేసి, విప్లవం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ, అతడి వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్ తీసుకొని గోదావరి వైపు నక్సలైట్లు పరుగులు తీశారు.


👉 ఎన్కౌంటర్ స్పెషలిస్టులే  టార్గెట్ గా…

కొరకరాని కొయ్యగా మారిన నాటి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ లు పేరుపొందిన  పోలీసు అధికారులు  నర్సింగరావు, వేణుగోపాలకృష్ణ,  రమేష్ బాబు, వేణుగోపాలరావు, సుదర్శన్, హబీబ్ ఖాన్, జగన్మోహన్ రెడ్డి,  తదితర అధికారులే టార్గెట్ గా నక్సల్స్  ఆధునిక టెక్నాలజీలతో  దాడులకు ప్రయత్నించినా, ఈ దాడులను విఫలం అయ్యాయి.

నాటి జగిత్యాల డి.ఎస్.పి వేణుగోపాలకృష్ణ, సీఐ నరసింగరావు లను మట్టు పెట్టేందుకు రాష్ట్రంలో మొదటిసారి 1989 సెప్టెంబర్ లో బీర్పూర్  ఘాట్ రోడ్డు లో పేల్చిన మందు పాతర. వికటించి 14 మంది అమాయకులు హతమయ్యారు.

👉 లక్ష్మీ నరసయ్యను వెంటాడి వేటాడి మట్టు పెట్టారు..

తమ సహచర కానిస్టేబుల్ కోమల్ రెడ్డిని కాల్చి చంపిన నక్సలైట్ తుమ్మ లక్ష్మీ నరసయ్యను కోసం   పోలీసులు, అధికారులు సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టారు. కొన్ని నెలలపాటు ముంబై భీమండి పట్టణాల్లో లక్ష నరసయ్య కోసం రిక్కి నిర్వహించారు. పోలీసులు వెంటాడుతున్నారు అని గుర్తించి లక్ష నరసయ్య ముంబై నుండి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్ల పేటలో గ్రామంలో తల దాచుకున్నాడు. ఆ గ్రామాన్ని కి సైతం  పోలీసులు రావడంతో తప్పించుకొని గోదావరి నది దాటి జగిత్యాల
డివిజన్ బట్ట పల్లి అడవిలో తలదాచుకున్న లక్ష్మీ నరసయ్య ను 1986 ఆగస్టు లో పోలీసుల చుట్టుముట్టి  హతమార్చారు.

( యధావిధిగా తాము లొంగిపొమ్మని పదే పదే కోరాము, మాపై కాల్పులు జరిపాడు పోలీసులు జరిపిన ఎదురు కాల్పులు నక్సలైట్ లక్షణాలు మృతి చెందాడు అనే పత్రిక ప్రకటన లో పోలీస్ అధికారులు  పేర్కొన్నారు. )

👉 దట్ ఇస్ కరీంనగర్ పోలీస్..


లక్ష్మీ నరసయ్య మృతదేహం స్వగ్రామం జైనుకు తరలిస్తుండగా, ధర్మపురిలో నక్సల్స్ కోమల్ రెడ్డిని  కాల్చి హతమార్చిన స్థలంలో . నక్సలైట్ లక్ష్మీ నరసయ్య  మృతదేహాన్ని పెట్టి  ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులు ఎస్ ఎల్ ఆర్, ఏ కె 47 తుపాకులు ఎక్కుపెట్టి కోమల్ రెడ్డి అమర్ హై అంటూ  నినాదాలు చేస్తూ కోమల్ రెడ్డికి  వారు కన్నీటి నివాళులర్పించారు. దట్ ఇస్ కరీంనగర్ పోలీస్ అంటూ కొందరు పోలీసు అధికారులు ఈ సందర్భంగా నినాదాలు చేశారు.

👉 పోలీసులు టార్గెట్ గా మందు పాతర !

నాటి హోం మంత్రి మాధవ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమానికి సారంగాపూర్ మండల కేంద్రానికి వచ్చారు. పర్యటనలో ఖరారు కానీ వార్ అగ్రనేత గణపతి స్వగ్రామం బీర్పూర్ కు వెళ్లారు. మంత్రిని స్వాగతించడానికి సర్పంచ్ రాలేదు, ఏదో మొక్కుబడిగా పదిమంది గ్రామస్తులు వచ్చారు. ఆ గ్రామంలో  ప్రభుత్వ పాఠశాలలో లేవు,   పంచాయతీ భవనాలు లేవు మీ నాయకులు నక్సలైట్ ఉద్యమంతో ఏం సాధిస్తారు అంటూ హోంమంత్రి గ్రామస్తులను ఉద్దేశించి అన్నారు.

హోం మంత్రి పర్యటనను కావాలని ఖరారు చేసిన జగిత్యాల డిఎస్పి వేణుగోపాలకృష్ణ, సీఐ నరసింహారావు లను హత మార్చడానికి  మొదటిసారి మందు పాతర తో మట్టు పెట్టడానికి శ్రీకరం చుట్టారు.  వారధినేత గణపతి సమీప బంధువు తిరుపతిరావు ను దారుణంగా హతమార్చి పోలీస్ అధికారులు విచారణకు గ్రామానికి వచ్చేలా పథకం అమలు చేశారు. వారు వచ్చే దారిలో 7 మందు పాతర లు అమర్చారు. అద్దె జీప్ లోఅదే దారి గుండా వస్తున్న  వాహనంను పోలీస్ జీప్ గా భావించి మందు పాత్ర పేల్చడంతో  14 మంది అమాయకుల  ప్రాణాలు గాలిలో కలిశాయి.

👉 పోలీస్ హత్యల పరంపర లో కొన్ని మాత్రమే..

ధర్మపురి సంఘటనతో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలీసుల పై ప్రత్యేక దాడులకు,  నక్సల్స్ వేట ఆరంభించారు. పెద్దపల్లి డి ఎస్ పిగా పనిచేస్తున్న బుచ్చిరెడ్డి నీ నక్సల్స్ కాల్చి చంపారు.

👉 1991 డిసెంబర్ 19న హుస్నాబాద్ మండలం రామవరం, వద్ద నక్సల్స్ పేల్చిన మందుపాతర లో సిఐ యాదగిరి , ఎస్ ఐ  జాన్ విల్సన్ ,.మరో ఇద్దరు కానిస్టేబుళ్లు చనిపోయారు. 

👉 1993 అక్టోబర్ 12 న ధర్మపురి మండలం నేరెళ్ల,  బట్ట పెళ్లి వద్ద నక్సల్స్ పేల్చిన మందుపాతరలో, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబులు, రాజయ్య,  శ్రీనివాస్,  ప్రకాష్ లు మృతిచెందారు. 

👉 1992  సెప్టెంబర్ 2న ముత్తారం మండలం గాజులపల్లి,  వద్ద మందుపాతర పేల్చి సివిల్ పోలీసులు, కాకుండా నక్సల్స్ ఏరివేత కోసం వచ్చిన ఇండో టిబెటన్ బోర్డర్ సెక్యూరిటీ పోలీసులు 9 మంది మృతి చెందారు.

👉 1994 లో ఎన్నికల బందోబస్తు కోసం వచ్చిన పంజాబ్  కమాండోల ను మహదేవ్ పూర్  మండలం లంకల గడ్డ, వద్ద మందుపాతర పేల్చి నక్సల్స్ హతమార్చారు. ఈ సంఘటనలో కమాండెంట్, గురు దీప్ సింగ్ సాయి,  అసిస్టెంట్ కమాండెంట్, సివిల్ ఎస్ ఐ ,వై వెంకటస్వామి, మరో ఐదుగురు మృతి చెందారు.

👉 1999 ఎన్నికలలో రిపోలింగ్ బందోబస్తు కోసం ,వెళుతున్నా  పోలీసు బృందం మహా ముత్తారం మండలం దుబ్బ లపాడు ,వద్ద మందుపాతర పేల్చిన నక్సల్స్ ఆర్.ఎస్.ఐ సంజీవరెడ్డి, తోపాటు మరో ముగ్గురు కానిస్టేబుల్లు హతమయ్యారు.

👉 1998 సెప్టెంబర్ 13న మెట్టు పల్లి మండలం ఆత్మకూరు, లో నక్సల్స్ కాల్పులు జరిపి జగిత్యాల కానిస్టేబుల్ రవీందర్ నాయక్ ను చంపారు. 1990 మార్చి 9న మేడిపల్లి మండలం  ఒడ్డడు, గ్రామంలో నక్సల్ కాల్పుల్లో కానిస్టేబుల్ రాజన్న, కోహెడ మండలం సింగరాయకొండ జాతరాలో కానిస్టేబుల్  ప్రకాష్ సింగ్ ను  కాల్చిచంపారు.

👉 1991 ఫిబ్రవరి 9న. భూషణ రావు పేట, లో జరిగిన ఎదురు కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్  ఫసల్ ఉద్దీన్, కానిస్టేబుల్ , మోహినుద్దీన్  మృతిచెందారు. 1991 సెప్టెంబర్ 10న జగిత్యాల మండలం కల్లెడ, సమీపంలోని కుక్కల గుట్ట వద్ద, నక్సల్స్ పోలీసుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో  హెడ్ కానిస్టేబుల్, మోబిన్, మృతి చెందాడు. 

👉 1993 జూన్ 14న మలహార్ మండలం, ఎడవల్లి, వద్ద మందుపాతర పేల్చడంతో ఎస్ఐ, సుభాన్ మృతి చెందాడు.

👉 1993 జూలై 8 న వరంగల్, కరీంనగర్ జిల్లా సరిహద్దు భూపాలపల్లి,సమీప అటవీ మార్గంలో నక్సల్స్  పేల్చిన మందుపాతర లో ఏ ఆర్ ఎస్ ఏ వెంకటాచారి, హెడ్ కానిస్టేబుల్, నాగభూషణం , కానిస్టేబుల్లు  కిషన్ రావు, రవీందర్, దేవయ్య లు మృతి చెందారు.

👉 1994 అక్టోబర్ 28 న నక్సల్స్ జరిపిన కాల్పులు గంభీరావుపేట ఎస్ ఐ, ఎన్ డి సాబీర్ ఖాన్ ,మృతి చెందారు.

👉 2003 ఫిబ్రవరి 11న  కోనరావుపేట మండలం వట్టెంల,  తండాకు విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన కానిస్టేబుల్స్ నాయక్, కృష్ణ లను,  నక్సల్స్ కాల్చి చంపారు.

👉 2005 అక్టోబర్ 21న. ధర్మపురి పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీస్ అమరవీరుల స్తూపం ఏర్పాటు చేశారు ప్రతి ఏటా ఇక్కడ విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు నివాళులు అర్పిస్తుంటారు.