👉 బిఆర్ఎస్ పదేళ్లలో చేసిన బాకీలకు ప్రజలు గుణపాఠం చెప్పారు.
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ప్రజల ప్రయోజనం కోసం సంక్షేమ పథకాలు అందిస్తు ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని, బిఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో ప్రచారం కోసమే పనిచేశారని, వారి పది సంవత్సరాల పాలనకు, చేసిన బాకీలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు అని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు..
పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీని సైతం పూర్తిగా అమలు చేయలేకపోయింది. ఇప్పుడు ‘బాకీ కార్డు’ పేరుతో ప్రజల మధ్యకు రావడం సిగ్గుచేటు విషయం” అని మంత్రి ధ్వజమెత్తారు.
👉 బహిరంగ చర్చకు రండి – మేము సిద్ధమే!
పదేళ్ల పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చారో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు బహిరంగ చర్చకు రావాలి.
తేదీ, సమయం వారే చెప్పండి మేము సిద్ధమే అని మంత్రి అడ్లూరి సవాల్ విసిరారు.
👉ప్రజల బాకీలు తీర్చకుండా ‘బాకీ కార్డు’ ?
ప్రజల కష్టంతో నిండిన రాష్ట్రాన్ని అప్పుల బాట పట్టించి,ఇప్పుడు ప్రజలే మోసపోయినట్లు నటించడం హాస్యాస్పదం ఈసారి ప్రజలే తీర్పు చెప్పి నిజమైన బాకీ తీర్చేస్తారు” అని అన్నారు..
👉 ప్రజల డబ్బుతో పార్టీ ప్రచారం !
బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధికి కాదు, ప్రచారానికి ప్రభుత్వ ఖజాన నుండి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.ప్రజల పన్నులతో కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీని నడిపారు.
ఇప్పుడు రుణాల మడుగులోకి నెట్టిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది అని అన్నారు.
👉 కాంగ్రెస్ మాట ఇస్తే తప్పక నెరవేర్చుతుంది !
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇరవై నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోంది ప్రజల విశ్వాసమే మా బలం ప్రజల మద్దతుతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాం అని మంత్రి తెలిపారు.
👉 ధర్మపురి అభివృద్ధికి కొత్త ఊపు !
ధర్మపురి అభివృద్ధి పనులకు వేగం వచ్చింది.
డిగ్రీ కళాశాల జీఓ త్వరలో వస్తుంది గోదావరిలో మురుగునీరు కలవకుండా ₹17 కోట్లతో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు జరుగుతోంది.
రోళ్లవాగు ప్రాజెక్టు పనులు ఇరిగేషన్, ఫారెస్ట్ శాఖల మధ్య సమన్వయ లోపంతో నిలిచిపోయాయి త్వరలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో సమీక్ష నిర్వహించనున్నాం.
👉 ధర్మపురికి బస్‌డిపో, పాలిటెక్నిక్ కళాశాలలు త్వరలో ఏర్పాటు కానున్నాయి నేరెళ్ల వద్ద ₹ 200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ కళాశాల నిర్మాణానికి డిప్యూటీ సీఎం చేతులమీదుగా భూమిపూజ జరగనుంది.
👉 బెస్ట్ అవైలబుల్ స్కూల్ బిల్లులకు జీవం పోశాం !
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెండింగ్‌లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ బిల్లులను పరిష్కరించేందుకు ఎస్సీ–ఎస్టీ శాఖలకు అత్యవసర నిధుల కింద ₹60 కోట్లు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
👉 గత ప్రభుత్వంలో లిఫ్టులకు నిధులు ఇవ్వక కాంట్రాక్టర్లకు ఇబ్బందులు కలిగించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹ 82 లక్షల బిల్లులు మంజూరు చేసింది అని పేర్కొన్నారు.
👉 నియోజకవర్గంలో సాగునీటి కోసం ఆక్సాయి పల్లె రిజర్వాయర్ మరియు స్తంభంపల్లి చెరువు పనులు పూర్తి చేస్తామన్నరు.
👉 2027 గోదావరి పుష్కరాలు నభూతో నభవిష్యత్ రీతిలో !
2027 గోదావరి పుష్కరాలు తెలంగాణ చరిత్రలో విశిష్టంగా నిలవనున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పుష్కరాల అభివృద్ధి పనులపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధుల సూచనలు స్వాగతిస్తామని మంత్రి తెలిపారు.
👉 బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు ప్రజలే బాకీ వసూలుదార్లు 2028 ఎన్నికల్లో ప్రతి ఓటు తీర్పుగా మారుతుంది.
👉 కేసీఆర్ పాలనలో వాగ్దానాలు ఆవిరైపోయాయి ప్రజల ఆశలు చిద్రమయ్యాయి.ఇక ప్రజలు నోరు మూయరు పది సంవత్సరాలు మోసానికి సమాధానం ఓట్లతోనే ఇస్తారు అని మంత్రి లక్ష్మణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.