ప్రవచన కార్యక్రమ విజయానికి కృషి చేసిన వారికి మంత్రి కృతజ్ఞతలు !

👉 బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమ నేపథ్యంలో…

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో ప్రముఖ ప్రవచకులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమాన్ని విజయవంతం కు  సహకరించిన వారికి సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈనెల 11, 12 తేదీలలో ధర్మపురి శ్రీ మఠం మైదానంలో రెండు రోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలకు జిల్లా నుండే గాక ఇతర జిల్లాల నుండి వేలాది మంది భక్తజనం తరలివచ్చారు.

భక్తులతో పాటు, మంత్రులు శ్రీధర్ బాబు, మాజీమంత్రి టి జీవన్ రెడ్డి, ప్రముఖ ప్రవచకులు శృంగేరి పీఠం ఆస్థాన పండితుడు డాక్టర్ భాష్యంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, కలెక్టర్, ఎస్పి, తదితర ప్రముఖులు సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు.

భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలగకుండా వేదిక, సభా వేదిక, నిర్వహణ, విద్యుదీకరణ, తదితర అంశాలు ఏర్పాట్లు చేసిన ధర్మపురి ఆలయ కార్యనిర్వహణాధికారికి, సిబ్బందికి, పాలకవర్గం సభ్యులకు, అర్చకులు, వేద పండితులకు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు జిల్లా యంత్రాంగానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదివారం రాత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

శాంతి భద్రతల పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల క్రమబద్ధీకరణ, అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ తదితర ఏర్పాట్లు చేసిన స్థానిక జిల్లా పోలీసు యంత్రాంగానికి మంత్రి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులకు, భక్తులకు, భోజన సదుపాయాలు, వాటర్ బాటిల్స్ అందించిన దాతలకు, మంత్రి లక్ష్మణ్ కుమార్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.