👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
జల్–జంగల్–జమీన్ నినాదంతో రాచరికం, దొరతనం పై పోరాడిన ఆదివాసీ గోండుల వీరత్వాన్ని చాటిన విప్లవ వీరుడు కొమరం భీమ్ అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
విప్లవ వీరుడు కొమరం భీమ్ వర్ధంతి సందర్భంగా మంగళవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి ఆసిఫాబాద్ జిల్లా కెరిమేరి మండలం జోడేఘాట్ వద్ద కొమురం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
కొమరం భీమ్ త్యాగం, ఆదివాసీ సమాజ ఆత్మగౌరవానికి ప్రతీక అని ఆయన చూపిన మార్గం నేటితరం యువతకు శాశ్వత స్ఫూర్తి దాయకం అని అన్నారు. మంత్రులకు ఆదివాసి సాంప్రదాయ పద్ధతిలో గోండులు ఘన స్వాగతం పలికారు.