రేపు ధర్మపురిలో చాగంటి ప్రవచన కార్యక్రమం !

👉 శని ఆదివారాలు రెండు రోజులపాటు చాగంటి ప్రవచనం !

👉 సాయంత్రం 6 గంటల నుండి 8 వరకు ప్రవచనం !

👉 వేదిక గోదావరి తీరం శ్రీ మఠం మైదాన ప్రాంగణం !

J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ప్రవచనం గోదావరి నది తీరం శ్రీ మఠం మైదాన ప్రాంగణంలో శనివారం సాయంత్రం 6 గంటలకు ఆరంభం కానున్నది.

సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రత్యేక ఆహ్వానం మేరకు చాగంటి కోటేశ్వరరావు ధర్మపురి క్షేత్రంలో ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు.

మంత్రి లక్ష్మణ్ కుమార్, సూచనలతో, ఆలయ అధికారులు, పాలకవర్గం, ప్రభుత్వ యంత్రాంగం,  గత మూడు రోజులుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మైదానం చదును చేయడం, వేదిక, వాహనాల పార్కింగ్ స్థలాలు గుర్తించడం, భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ముందస్తు ఏర్పాట్ల చర్యలు చేపడుతున్నారు. క్షేత్రంలో స్వాగత తోరణాలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.

👉 బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గూర్చి..

చాగంటి కోటేశ్వరరావును, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  2024 నవంబర్ 9 న, క్యాబినెట్ హోదా కల్పిస్తూ సలహాదారుగా నియమించుకున్నారు.

👉 ఈయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు. తండ్రి చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ. 1959 జూలై 14 న  జన్మించారు. కోటేశ్వరరావు సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలు.

👉 చాగంటి ధారణ శక్తి, జ్ఞాపకశక్తి చెప్పుకోదగ్గవి. మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణములను అధ్యయనము చేసి, తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ,భక్తజనమును పులకింప చేస్తారు.

👉 మండల దీక్షతో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణమును, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహా పురాణాన్ని, 40 రోజుల పాటు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రమును అనర్గళంగా ప్రవచించి పండిత, పామరుల మనసులను పరవశింప చేస్తున్నారు.

👉 చాగంటి  అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు. యూనివర్సిటీ స్థాయిలో గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు.

👉 చాగంటి ధారణాశక్తి అసమానం, శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే అది మొత్తం అతను మదిలో నిలిచిపోతుంది. ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు.

👉 కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చుని భక్తులముందు భారతభాగవత ప్రవచనాలు ఇచ్చేవారు, డబ్బు లు తీసుకునేవారు కాదు, అతను స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తజనం ను విశేషంగా ఆకర్షించి అభిమానులు పెరిగారు.