👉 పోలీస్ ప్రెస్ మధ్య క్రికెట్ మ్యాచ్ – విజేత పోలీస్ టీమ్!
👉 జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ !
J SURENDER KUMAR,
పోలీసులు మరియు మీడియా సమాజానికి చాలా అవసరమని, మీడియా మరియు పోలీసులు సమాజంలో ఒకే లక్ష్యంతో పనిచేస్తారు అని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.
జగిత్యాల పోలీస్ కార్యాలయం మైదానంలో ఆదివారం పాత్రికేయులకు పోలీసులకు మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఇందులో పోలీసులు విజయం సాధించారు.
👉 ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..

క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని నిత్యం బిజీగా ఉండే పోలీసులు, జర్నలిస్టులు కొంత సేపు ఆహ్లాదకరంగా గడిపారు అని అన్నారు.
ప్రెస్ పోలీసుల మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండడానికి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుందన్నారు..ప్రతి సంవత్సరం ఒక సారి ఈ విధంగా క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ద్వారా ప్రతి ఒక్కరికీ ఆటవిడుపు తో పాటు మంచి టీమ్ స్పిరిట్ వస్తుందని ఎస్పీఅభిప్రాయపడ్డారు.

ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను ఎస్పీ ప్రారంభించారు. మొదటగా ఎస్పీ టాస్ వేశారు. టాస్ గెలిచిన ప్రెస్ జట్టు మొదటగా బ్యాటింగ్ చేపట్టారు. నిర్ణీత 12 ఓవర్లకు 90 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పోలీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 91 పరుగులు చేయడం తో విజయం సాధించింది.
అనంతరం విజేత, రన్నర్ జట్టులకు ట్రోఫీ లను ,జట్టు సబ్యులకు మెమెంటోలు, “బెస్ట్ బ్యాట్స్‌మన్”, “బెస్ట్ బౌలర్”, “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డులు ఎస్పీ అందజేశారు.

డీఎస్పీలు వెంకటరమణ, రఘు చందర్, రాములు , జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు చిట్టి శ్రీనివాస్ రావు, యూనియన్ నాయకులు, SB ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, సి.ఐ లు అనిల్ కుమార్ ,రామ్ నరసింహ రెడ్డి, సురేష్, రవి, కరుణాకర్, RI లు సైదులు, వేణు, మరియు ఎస్.ఐ లు, పాత్రికేయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 
													