J SURENDER KUMAR,
మైనారిటీల సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జమాత్ ఉలెమా అధ్యక్షుడు మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్ ఎంతో కృషి చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సామాజిక సేవకుడిగా హిందూ ముస్లింలు కలిసి ఉండేలా ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు.
👉 మౌలానా హఫీజ్ అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందగా, ముఖ్యమంత్రి జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని షహీన్‌నగర్‌లోని హఫీజ్ పీర్ షబ్బీర్ నివాసానికి సోమవారం వెళ్లి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.

👉 హఫీజ్ మరణం ముస్లిం సోదరులకే కాకుండా మొత్తం తెలంగాణకు తీరని లోటు అని ముఖ్యమంత్రి అన్నారు. సమాజానికి వారు చేసిన సేవలు మరువలేనివని, వారి మరణం ఎంతో బాధాకరమని వ్యాఖ్యానించారు.
👉 హఫీజ్ ఆశయాలకు అనుగుణంగా మైనారిటీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, వారి సేవలను శాశ్వతంగా గుర్తించే విధంగా ప్రభుత్వం తగిన ఆలోచన చేస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు.
