👉 కొండగట్టు, ధర్మపురి ఆలయాలు సందర్శించిన పీఠాధిపతులు!
J.SURENDER KUMAR,
సనాతన ధర్మాన్ని కాపాడడమే లక్ష్యంగా, ఆలయాల పరిరక్షణ కోసం దత్తగిరి మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్, విశ్వ మానవ ధర్మ ప్రచారం ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నామని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ 108 వైరాగ్యశిఖామణి అవధూతగిరి మహారాజ్, మహామండలేశ్వర్ 108 డాక్టర్ మహంత్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ అన్నారు.
శనివారం రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు శ్రీ ఆంజనేయ స్వామి కొండగట్టు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ధర్మపురి ఆలయాలను వారు సందర్శించారు.
ఈసందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు దేవాలయ ఆగమ పాఠశాల విద్యార్థులచే వేదమంత్రాల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
👉 ఈ సందర్భంగా పీఠది పతులు మాట్లాడుతూ…
“సనాతన ధర్మం అంటేనే శాశ్వతమైన విధి. ఇది కాలాతీతమైన సత్యాన్ని ప్రతిబింబిస్తుంది, విశ్వం యొక్క ఉనికికి ఇది మూలం అని అన్నారు. విశ్వ మానవ ధర్మ ప్రచారం ఆధ్వర్యంలో ఇప్పటికే పలు దేవాలయాల్లో ధర్మ పరిరక్షణ కోసం అనేక ధర్మ సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ గ్రామాల్లో ఉన్న పురాతన ఆలయాల పరిరక్షణ కోసం కృషి చేయాలని సూచించారు.
గ్రామాల్లో ఏవైనా పురాతన ఆలయాలు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. గురువులను, తల్లిదండ్రులను గౌరవించి పూజించాలన్నారు. వారికి ఆలయ పక్షాన అర్చకులు, అధికారులు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీకాంతా రావు, ప్రధాన అర్చకులు రామ కృష్ణ, రఘు, స్థాన చార్యులు, కపిందర్ స్వామి ఉప ప్రధాన అర్చకులు, చిరంజీవులు ఆలయ పర్యవేక్షకులు. సునీల్ కుమార్, చంద్రశేఖర్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.
👉 ధర్మపురి క్షేత్రంలో…

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనార్థం శ్రీ శ్రీ శ్రీ వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం బర్దిపూర్ సంగారెడ్డి జిల్లా శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు.
వీరికి ఆలయ పక్షాన సాంప్రదాయం పద్ధతిలో పూర్ణకుంభంతో మేళ తాళాలతో స్వాగతం పలికిన పిదప దర్శనం అనంతరం శ్రీ స్వామివారి శేష వస్త్రం ప్రసాదం చిత్రపటం వేద పండితులు అర్చకుల ద్వారా సన్మానించారు.

ఇట్టి కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు వేద పండితులు ఉప ప్రధాన అర్చకులు ముఖ్య అర్చకులు సూపరింటెండెంట్ కిరణ్ , సీనియర్ అసిస్టెంట్ మరియు సిబ్బంది అర్చకులు పాల్గొన్నారు.