👉 సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏబిసి విద్యార్థుల సంక్షేమం కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రభుత్వంలో అక్టోబర్ నాటికి ₹463 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేశామని ఎస్సీ ఎస్టీ , మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో గురువారం మంత్రి లక్ష్మణ్ కుమార్, ఓవర్సీస్ స్కాలర్ షిప్ బకాయిల విడుదల పై మీడియా సమావేశంలో మాట్లాడారు.
👉 మీడియా సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడిన పాయింట్స్ !
గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షిష్టంగా ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని మా ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు.
👉 ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులందరికీ విద్య ద్వారా సమాన అవకాశాలు వారి ఉజ్వల భవిష్యత్ కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఒక్కో విద్యార్థికి ఓవర్సీస్ పథకం కింద ₹ 20 లక్షలు ఇచ్చాం.
👉 2288 విద్యార్థులకు గాను, సుమారు ₹ 304కోట్ల నిధులు విడుదల చేశాం ( అక్టోబర్ 2025 లో )
₹463 కోట్లు విడుదల చేశాం (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసి) 2022 నుంచి ఈ రోజు వరకు బకాయిలను మొత్తం విడుదల చేశాం అన్నారు.
👉 అర్హతకలిగిన విద్యార్థులకు నేరుగా వారు బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమవుతుంది. విదేశాల్లో ఉన్నత విద్యను కొనసాగిస్తున్న మన తెలంగాణ విద్యార్థులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను గమనించి ఓవర్సీస్ స్కాలర్ షిప్ నిధులను మా ప్రభుత్వం విడుదల చేశామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 ఈ నిధుల విడుదల ద్వారా విద్యార్థుల కలలను నేరవేర్చడంతో పాటు వారి కుటుంబాల్లో వెలుగులు నింపింది.విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనను మా ప్రభుత్వం అర్దం చేసుకుంది.
👉 యూకే ,అమెరికా యూరప్ ఆస్ట్రేలియాతో పాటు పలు విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మా ప్రభుత్వం ఊరట కల్పించడంతోపాటు ప్రస్తుతం విదేశాల్లో అననూకూల పరిస్థితుల కారణంగా మన రాష్ట్ర విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకు ఈ నిధుల ద్వారా వారికి కొంత ఉపశమనం లభిస్తుంది
👉 సంక్షేమ హాస్టల్స్ లో (ఎస్సీ ఎస్టీ బీసీ, మైనార్టీ) హాస్టల్స్ తక్షణ ఇబ్బందులను అధిగమించేందుకు ₹60 కోట్లు విడుదల చేశామని ఈ మొత్తం ఆయా జిల్లా కలెక్టర్లు, సెక్రటరీల పరిధిలో అందుబాటులో ఉన్నాయని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 సంక్షేమ హాస్టల్లో ఏ సమస్య ఉన్న తక్షణ పరిష్కారం కోసం నిధులు మంజూరు చేశాం. సీఎం సహాయ నిధి నుంచి సంక్షేమ హాస్టల్ పిల్లలకు నిదులు అందించాం .
👉 119 నియోజకర్గాల్లో సుమారు ₹ 200 కోట్ల బడ్జెట్ తోని యంగ్ ఇంటి గ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
👉 గత పది సంవత్సరాలు పరిపాలించిన బిఆర్ఎస్ నాయకులు సంక్షేమ హాస్టల్స్ పిల్లల డైట్ కోసం ఆలోచన చేయలేదు మా సీఎం, డిప్యూటీ సీఎం చొరవతో డైట్ ఛార్జీలు పెంచాం అన్నారు.
👉 మా అధికారులందరూ సంక్షేమ పాఠశాలలు, హాస్టల్స్ విద్యార్థులకు ఏ సమస్య ఉన్న తక్షణం పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తున్నారు.
👉 అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి అర్హత ఉన్న వారికే ఇస్తాం అర్హత లేని వారికి విద్యా నిధి ఇవ్వం అని మంత్రి స్పష్టం చేశారు.
👉 ఈ నిధుల విడుదలకు కృషి చేసిన మా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క కు ధన్యవాదాలు తెలిపారు.మీడియా సమావేశంలో వెల్ఫేర్ చీఫ్ సెక్రటరీ సభ్యసాచి గోష్, ఎస్ సి డి డి చీఫ్ సెక్రటరీ బుద్ధ ప్రకాష్, కమిషనర్ క్షితిజ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అదనపు డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
