J.SURENDER KUMAR,
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ను , అడిషనల్ ఎస్పీ S. మహేందర్ మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ లను ఘనంగా సన్మానించారు..
అక్టోబర్ 21వ తేదీ పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసే విషయంలో జిల్లా ఎస్పీ, ఏఎస్పీలను మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు.
అమరవీరుల పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జిల్లా ఎస్పీ హెడ్ క్వార్టర్ లో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు వారి దృష్టికి తీసుకెళ్లారు.

ఈసారి కూడా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని ఎస్పీ డివి శ్రీనివాస్ రావు సూచించారు. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తం అందుబాటులో ఉంటుందని వారు ఎస్పీ దృష్టికి తీసుకోవచ్చారు. అవసరమైన వారికి రక్తం అందుబాటులో ఉంటుందా ? అని ఎస్ పి ప్రశ్నించారు. రక్తదాతల సమూహంకు సంబంధించిన ఒక గ్రూపును క్రియేట్ చేస్తే బాగుంటుందని ఎస్పీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అనంతరం మెదక్ డిఎస్పి డి ప్రసన్నకుమార్ ను కలిసి సభ్యులు ఘనంగా సన్మానించారు.. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్, కోశాధికారి డి.జి. శ్రీనివాస శర్మ. ఎంసీ మెంబర్లు DEME యాదగిరి, ప్రసాద్ తదితరులు ఉన్నారు