J SURENDER KUMAR,
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, చాగంటి కోటేశ్వరరావు, కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.


ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ముందుగా యమధర్మరాజుకు పూజలు నిర్వహించిన చాగంటి ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభానికి నమస్కరించి ఆలయంలో అడుగు పెట్టారు.

అర్చకులు చాగంటి గోత్రనామాల పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం చేశారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చాగంటిని శాలువాతో సత్కరించి స్వామి వారి ప్రసాదం, చిత్ర పటాన్ని అందించారు.
