J SURENDER KUMAR,
శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు, సామాన్య భక్తులకు ఎలాటి అసౌకర్యం కలుగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమిష్టిగా , సమన్వయంతో సేవలందించిట్లు టిటిడి చైర్మన్ బీ ఆర్ నాయుడు అన్నారు. టీటీడీ సిబ్బంది సంయమనంతో, ప్రణాళిక బద్ధంగా, సీనియర్ అధికారుల పర్యవేక్షణలో సేవలందించారని తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ ఏర్పాటు చేసిన సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం చైర్మన్ బీ ఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను దిగ్విజయం చేసిన టీటీడీ అర్చక స్వాములకు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా, పోలీసు యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా, భక్తులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తులకు, టీటీడీ సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజైన సెప్టెంబర్ 24వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా 2026వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రివర్యులు శుభాశీస్సులు అందజేశారు
ప్రపంచం నలుమూలల నుండి బ్రహ్మోత్పవాలకు విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు 16 శ్రీవారి వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం కల్పించాం అన్నారు.
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ₹102 కోట్లతో నూతనంగా నిర్మించిన పీఏసీ-5 భవనంను, భారత ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, సీఎం నారా చంద్రబాబు నాయుడు కలిసి ప్రారంభించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో క్యూలైన్ల నిర్వహణ కోసం నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించే పరికరాలను ప్రారంభించారు.
గరుడసేవ రోజున హోల్డింగ్ పాయింట్ల ద్వారా ఈసారి అదనంగా 30వేలు, రీఫిల్లింగ్ ద్వారా 15వేల మందికి దర్శనం చేసుకున్నారన్నారు.
బ్రహ్మోత్సవాలకు ఈ 8 రోజుల్లో 5.80 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, ₹ 25.12 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది. 26 లక్షల మంది భక్తులకు పైగా అన్న ప్రసాదాలు పంపిణీ చేశాం. 2.42 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 28 లక్షలకు పైగా లడ్డూలను భక్తుల విక్రయించడం జరిగింది. ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా తిరుపతి నుండి తిరుమలకు 14,459 ట్రిప్పుల ద్వారా 4.40లక్షల మంది, తిరుమల నుండి తిరుపతికి 14,765 ట్రిప్పుల ద్వారా 5.22 లక్షల మంది భక్తులను చేరవేశాం అన్నారు.
👉 సాంస్కృతిక కార్యక్రమలు
వాహనసేవల ముందు మునుపెన్నడూ లేనివిధంగా 28 రాష్ట్రాల నుండి 298 కళా బృందాలలో, దాదాపు 6,976 మంది కళాకారులు, అదే విధంగా గరుడసేవ రోజు 20 రాష్ట్రాల నుండి 37 కళా బృందాలతో 780 కళాకారులతో ప్రదర్శన.
👉 పుష్పాలంకరణ
బ్రహ్మోత్సవాలలో 60 టన్నులు పుష్పాలు, 4 లక్షల కట్ ఫ్లవర్స్, 90 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగం
👉 విద్యుత్ అలంకరణలు
తిరుమలలో విద్యుత్, పుష్పాలంకరణలు చాలా బాగున్నాయని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. వాహన సేవలను భక్తులు వీక్షించేలా 36 పెద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు.
👉 ఎస్వీబీసీ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించేలా HD క్వాలిటీలో ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. ప్రముఖ పండితులచే వ్యాఖ్యానం.
👉 శ్రీవారి సేవకులు
బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులకు 3500 మంది శ్రీవారి సేవకులు విశేష సేవలు.
👉 వైద్యం
50 మంది డాక్టర్లు, 60 మంది పారామెడికల్ సిబ్బందిని, 14 అంబులెన్సులు వినియోగించి భక్తులకు మెరుగైన వైద్య సేవలు.
👉 భద్రత
బ్రహ్మోత్సవాలకు 4వేల మంది పోలీసులు, 1800 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రత. గరుడ సేవ రోజున అదనంగా 1000 మంది పోలీసులు విధులు.
తిరుమల, తిరుపతిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా పార్కింగ్ ఏర్పాట్లు.
👉 ఆరోగ్యశాఖ
గరుడసేవ రోజు పారిశుద్ధ్య కార్మికులు విశేష సేవలు. 2800 మంది సిబ్బందితో తిరుమలలో మెరుగైన పారిశుద్ధ్యం. గరుడ సేవ రోజు అదనంగా 650 మంది సిబ్బందితో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు.
ఈ సమావేశంలో టీటీడీ సివిఎస్ఓ కే.వి. మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, బోర్డు సభ్యులు
జ్యోతుల నెహ్రూ, సదాశివ రావు, శ్రీమతి జానకి దేవి, జి.భానుప్రకాష్ రెడ్డి, శాంతా రామ్, నరేష్, పలువురు అధికారులు పాల్గొన్నారు.