తిరుమల తిరుపతి దేవస్థానంకు కోటి రూపాయల విరాళాలు !


J.SURENDER KUMAR,

తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం కోటి 5 లక్షల రూపాయలు విరాళాలను నలుగురు దాతలు అందించారు.
హైదరాబాద్ కు చెందిన ఏడీవో ఫౌండేషన్  అనే ఎన్జీవో సంస్థ  టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు ₹ 75 లక్షలు విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్  బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

👉 రాకేష్ రెడ్డి ₹ 10 లక్షలు !

బెంగుళూరుకు చెందిన రాకేశ్ రెడ్డి అనే భక్తుడు సోమవారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు ₹ 10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీ అందజేశారు.

👉 కుప్పాల గిరిధర్ కుమార్ ₹ 10 లక్షలు !

 తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ అనే భక్తుడు ఆదివారం రాత్రి టీటీడీ ఎస్వీ విద్యాదానం ట్రస్టుకు ₹ 10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలోని  టిటిడి అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో  అదనపు ఈవో  సిహెచ్ వెంకయ్య చౌదరి కి  విరాళం చెక్ ను అందజేశారు.

👉 సింహాద్రి వెంకట శివ ప్రసాద్ ₹ 10 లక్షలు !

 గుంటూరుకు చెందిన అభయహస్త ఫైనాన్స్ సర్వీసెస్ సీఎఫ్ఓ  సింహాద్రి వెంకట శివ ప్రసాద్ అనే భక్తుడు టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు సోమవారం ₹ 10,00,116 విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, జంగా కృష్ణమూర్తి లు పాల్గొన్నారు.