యుద్ధప్రాతిపదికన ఇందిరమ్మ ఇండ్ల పూర్తి చేయాలి !

👉 10982 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
3 ఇళ్ళు నిర్మాణం పూర్తి !

👉 జిల్లా కలెక్టర్  సత్యప్రసాద్ ఆగ్రహం !

J.SURENDER KUMAR,

సోమవారం జగిత్యాల జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలో గృహనిర్మాణ శాఖ, మున్సిపల్, ఎంపిడివో అధికారులు, సంబంధిత అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్షించారు. సమీక్షలో  గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వివరాలను, సమస్యలను కలెక్టర్ కు అధికారులు వివరించారు.

👉 జిల్లాలో 10982 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 7343, మార్కౌట్ చేయగా 2984, బేస్మెంట్ స్థాయిలో 721, గోడల నిర్మాణం వరకు 369, స్లాబ్ దశకు రాగ 3, ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసుకున్నాయని కలెక్టర్ తెలిపారు.

👉 రాష్ట్ర స్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జగిత్యాల జిల్లా 22 స్థానంలో ఉందని అధికారులు  మెదటి 5 స్థానాల్లో ఉండే విధంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు.

👉 నిర్మాణంలో ఉన్న ఇండ్లను త్వరిత్వగతిన పూర్తిచేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పనులు పూర్తయిన సమాచారం ఆన్లైన్లో పొందుపరచాలని అధికారులను ఆదేశించారు.

👉 క్లస్టర్ వారిగా వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని తెలిపారు.పనులలో సమస్యల గురించి అడిగి తెలుసుకుని తగిన సూచనలు చేశారు.

👉 ఇందిరమ్మ కమిటీలను సమన్వయం చేసుకుంటూ పనులు తొందరగా పూర్తి చేయాలని కోరారు.నిర్మాణం చేపట్టాలని లబ్ధిదారులకు తెలుపాలన్నారు.

👉 ప్రొసిడింగ్ ఇచ్చిన ఇండ్ల నిర్మాణం పనులు దీపావళి వరకు ప్రారంభిచకపోతే రెండు, మూడు సార్లు నోటీసులు ఇచ్చి ఇతర అర్హులైన లబ్దిదారులను ఎంపికచేయాలనీ ఆదేశించారు.

👉 పనులు పూర్తి చేసిన లబ్ధిదారులకు ఖాతాల్లో డబ్బులు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేనియెడల సంబంధిత అధికారులను సంప్రదించాలని లబ్ధిదారులకు సూచించాలని తెలిపారు.

👉 జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన ఇసుక బజార్ నుండి ఇందిరమ్మ లబ్ధిదారులకు ఉచిత ఇసుక లభిస్తుందని అవసరమైన లబ్ధిదారులకు ఇసుక బజారు గురించి వివరించి నిర్మాణాలకు ఉచిత ఇసుక పొందేలా సూచించాలని తెలిపారు.

👉 ప్రభుత్వం నిర్దేశించిన పరిధిలోనే 400-600 చదరపు అడుగుల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లబ్ధిదారులకు తెలపాలన్నారు.

👉 బిల్లుల్లో జాప్యం, ఇతర సమస్యలుంటే పంచాయతీ కార్యదర్శుల ద్వారా నివృత్తి చేసుకోవాలని  తెలిపారు.

👉 మేస్త్రి, కూలీల కొరత లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని అవగాహనా  కల్పించాలన్నారు.

👉 నిరుపేదలైన లబ్ధిదారులకు మెప్మా, సెర్ప్ ద్వారా మహిళా సంఘాల రుణాలు ఇప్పించి నిర్మాణం పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గ్రామాల్లోని లబ్ధిదారుల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకొని నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. రాజా గౌడ్, జగిత్యాల, మెట్టుపెల్లి ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్,  ట్రైని అదనపు కలెక్టర్ కన్నం హరిణి,హోసింగ్ పిడి ప్రసాద్, డిపివో మదన్మోహన్, ఎంపిడివో లు, ఎంపివో లు,  క్లస్టర్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.