J.SURENDER KUMAR,
వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ పరిశీలన అనంతరం, హనుమకొండ చేరుకున్న ముఖ్యమంత్రి పట్టణంలోని సమ్మయ్య నగర్, కాపువాడ, పోతననగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.

👉 వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ఆ ప్రాంతాలను పరిశీలిస్తూ బాధితులతో మాట్లాడారు. అవసరమైన సహాయక చర్యలు తీసుకుని, అన్ని రకాలుగా ఆదుకుంటామని బాధితులకు భరోసానిచ్చారు. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, నాలాలను పరిశీలించి, మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. తక్షణం పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశాలిచ్చారు.

👉 ముఖ్యమంత్రి వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి , కొండా సురేఖ , పొన్నం ప్రభాకర్ తో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు ఉన్నారు.

👉 ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులు, తక్షణం తీసుకోవలసిన చర్యలపై ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

 
													