👉 వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లతో డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష !
J.SURENDER KUMAR,
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు మంగళవారం హైదరాబాద్ నుంచి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం పై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ , ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
👉 ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ…
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రైవేటు పాఠశాల యాజమాన్యం వారి బడులలో చదివే విద్యార్థులను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయడానికి వీలు లేదని తెలిపారు.
విద్యార్థులకు సంబంధించిన ఫీజు ప్రభుత్వం చెల్లిస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు . జిల్లా కలెక్టర్లు వెంటనే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యాజమాన్యులతో సమావేశమై విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాలని తెలిపారు. సామాజిక బాధ్యతగా భావించి విద్యా రంగం పై ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు.

ప్రైవేట్ పాఠశాలలకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం క్రమ పద్ధతిలో విడుదల చేస్తుందని, డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో జరుగుతున్న పాఠ్యాంశాల బోధన, వసతులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
ప్రైవేట్ స్కూల్స్ తో బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద ఎంఓయూ చేసుకునే సమయంలోనే ఫీజులకు సంబంధించిన అంశాలు ఉంటాయని యాజమాన్యాలకు తెలపాలని అన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూలు యజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలనీ తెలిపారు.
👉 సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..
కలెక్టర్లు జిల్లా విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులు సమన్వయం చేసుకుంటూ పాఠశాల యాజమాన్యులతో చర్చించి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజ్ కుమార్, ఎస్సి కార్పొరేషన్ ఈడి కిషోర్,విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.