👉 జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ !
J SURENDER KUMAR,
విజయదశమి పండుగ ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్ముడు రిజర్వ్ విభాగంలో ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ దుర్గా దేవికి ప్రత్యేక పూజలు చేశారు.


ఈ పూజా కార్యక్రమాలలో డిఎస్పీ లు వెంకటరమణ, రఘు చందర్, రాములు, వెంకటరమణ రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్, వేణు, సైదులు, ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, ఆరిఫ్ అలీ ఖాన్, రఫీక్ ఖాన్, శ్రీధర్, SI లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
👉 వెల్గటూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ !

వార్షిక తనిఖీల్లో భాగంగా వెల్గటూర్ పోలీస్ స్టేషన్ ను ఎస్పీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా పెండింగ్ ఉన్న కేసులపై రివ్యూ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ల పరిధిలోని కేసుల నమోదు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలని అడిగి తెలుసుకున్నారు.
ఫైల్స్, క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు.రికార్డ్ రూమ్, రైటర్ రూమ్ తదితర అన్నివిభాగాలు పరిశీలించారు. స్థానిక ఎన్నికలు సజావుగా జరగడానికి కావలసిన అన్నిరకాల ముందస్తూ ఏర్పాట్లను చేసుకోవాలని, గత ఎన్నికలలో చెడు నడత కలిగిన వారిని ముందుగానే గుర్తించి బైండోవర్ చేయాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ పరిదిలో గల పోలింగ్ స్టేషన్స్ మరియు పోలింగ్ లోకేషన్స్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రతి పోలింగ్ స్టేషన్ ను తప్పనిసరిగా సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకొని ఉండాలని, పోలింగ్ కేంద్రాలలో ఉండవలసిన కనీస వసతుల గురించి సమాచారం అందించాలని ఎస్పీ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పి రఘు చందర్ , డిసిఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ధర్మపురి సి.ఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్.ఐ లు ఉమా సాగర్, కృష్ణ సాగర్ రెడ్డి, రవీందర్,మరియు సిబ్బంది పాల్గొన్నారు