అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గం ధర్మారం మండలంలో దాదాపు ₹40 లక్షల విలువగల అభివృద్ధి పనులకు శుక్రవారం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా మొదట ₹ 10 లక్షల DMFT నిధుల ద్వారా నంది మేడారం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న మహిళా సంఘ భవనానికి, జిల్లా కలెక్టర్ నిధుల ద్వారా సుమారు ₹ 22 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన ఎల్టీ లైన్ల విస్తరణ పనులకు జిల్లా కలెక్టర్  నాయకులతో కలిసి మంత్రి భూమి పూజ చేశారు.

అనంతరం మేడారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన నూతన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎలక్షన్ కుమార్ ప్రారంభించారు.


DMFT నిధుల ద్వారా మంజూరు అయిన ₹ 8 లక్షల రూపాయలతో దళిత కాలనీలో నిర్మించనున్న పాఠశాల ప్రహరీ గోడ పనులకు శంకుస్థాపన చేసి నూతన విద్యుత్ స్థంబాల ఏర్పాటు పనులను మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.

అనంతరం ధర్మారం మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో ధర్మారం మండలానికి చెందిన అభివృద్ధి పనుల పైన జిల్లా కలెక్టర్  మరియు వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్ లో పాల్గొని వివిధ అభివృద్ధి పనుల పురోగతి పైన అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు