👉 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ప్రచారంలో !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J .SURENDER KUMAR,
గత పది సంవత్సరాలుగా టీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పార్టీలు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని విస్మరించి అభివృద్ధిని పట్టించుకోలేని మాజీ మంత్రి కేటీఆర్ కు ఉప ఎన్నికల్లో ఓటర్లు బుద్ధి చెప్పాలని ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి శ్రీనగర్ కాలనీలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తొ కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రోడ్ షో నిర్వహించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఒక్కరోజు కూడా జూబ్లీహిల్స్ ప్రజల మధ్యకు రాలేదు. ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. అభివృద్ధి పట్టించుకోనిరోడ్లు బీభత్సంగా ఉన్నాయి, డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతింది, బస్తీల్లో తాగునీటి సమస్యలు మరింత తీవ్రమయ్యాయనీ దుయ్యబట్టారు.
బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు మళ్లీ అభివృద్ధి పేరుతో మోసం చేసేందుకు వస్తున్నారు” అని మంత్రి మండిపడ్డారు.

ప్రస్తుతం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంది. అభివృద్ధి అంటే దొరలకు, ఉన్నత వర్గాలకు కాదని సామాన్య మానవుడి ఇంటి వరకూ చేరుకోవాలన్నారు.
జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలి అని మంత్రి విజ్ఞప్తి చేశారు.
👉 ఇంటి ఇంటి కి…

బోరబండ, ఎల్లారెడ్డి గూడ, వినాయకనగర్ రావు కాలనీలో అడ్లూరి ఇంటింటి మంత్రి ప్రచారం నిర్వహించారు .సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం స్థిరంగా ఉంది. ప్రతి కుటుంబానికి భద్రత, ప్రతి ఇంటికి వెలుగు ఇదే కాంగ్రెస్ ధ్యేయం,అని కాంగ్రెస్ ప్రభుత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అనేక విధాలు అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పుడు నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని, నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు.

👉 రికనైజడ్ స్కూల్ మెనెజ్‌మెంట్ అసోసియేషన్ సమావేశంలో ..,.
పాఠశాల స్థిరీకరణ, టీచర్ల సంక్షేమం, విద్యార్థుల నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వం కృషి చేస్తోందిఅని నవీన్ యాదవ్ గెలుపు కు సహకరించాలి అని మంత్రి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
👉 వివాహ వేడుకలో..

నోవాటెల్‌లో వివాహ వేడుకకు హాజరు
ప్రచార కార్యక్రమాల అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైటెక్స్ నోవాటెల్ హోటల్‌లో జరిగిన సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు ఎనుముల నరసింహ రెడ్డి కుమార్తె రచన రెడ్డి వివాహానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి హాజరయ్యారు.
