ఆదుకుంటా అధైర్య పడకండి మంత్రి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

మీరు అధైర్య పడవలసిన అవసరం లేదు మీకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వపరంగా సహాయం అందించి ఆదుకుంటా అని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గొర్రెల కాపరులు, యజమానులకు హామీ ఇచ్చారు.

ధర్మారం మండలం కటికేనపెల్లి, పెరుకపల్లి గ్రామాలకు చెందిన దాదాపు 80 గొర్రెలు వివిధ కారణాలతో  మృతి చెందాయి.శుక్రవారం రాత్రి గొర్రె కాపరులను, యజమానులను మంత్రి పరామర్శించారు.

గొర్రెల మృతికి కారణాలను వారిని అడిగి తెలుసుకున్నారు.
  కలెక్టర్  మరియు సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుండి ఆర్థిక సహకారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు.