గోదావరి హారతి లో పాల్గొన్న మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

పవిత్ర కార్తిక మాసం పురస్కరించుకొని ధర్మపురి పట్టణ కేంద్రంలోని గోదావరి నదీ తీరంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం  ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన గోదావరి హారతి కార్యక్రమంలో   రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి  గోదావరి నది మహా పూజలో పాల్గొని గోదావరి నదీమ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు, దీపార్చన చేసి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు,అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.