అమరావతిలో ఐజేయు 11వ ప్లీనరీ సమావేశాలు !

👉 ఏపీయూడబ్ల్యూజే కార్య నిర్వాహక సమావేశంలో !

J.SURENDER KUMAR,

మూడు దశాబ్దాల తర్వాత అమరావతి (విజయవాడ)లో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఈ ప్లీనరీ జరుగనున్నది. 1992లో రాంచీ లో ఆవిర్భావం, సమావేశం తరువాత రెండవ ప్లీనరీ విజయవాడలో జరిగింది.

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (APUWJ) విస్తృత కార్యనిర్వాహక సమావేశంలో
రాష్ట్రంలోని 28 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్న ఈ విస్తృత కార్యనిర్వాహక సమావేశంలో ప్లీనరీ నిర్వహణకు నిర్ణయించారు.


స్థానిక ఎంపీ కేసినేని శివానంద చిన్నిను చీఫ్ ప్యాట్రన్‌గా నియమించి, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ అధ్యక్షుడు సురేష్ ఆలపాటిను అధ్యక్షుడిగా, ఏపీయూడబ్ల్యూజె ప్రధాన కార్యదర్శి ఐ.వి. సుబ్బారావు, ఖజానాదారుగా జయరాజ్, ఏపీయూజె సాధారణ కార్యదర్శిగా నియమిస్తూ స్వాగత కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

వివిధ రంగాల ప్రముఖులను ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, నిర్వాహకులుగా సలహాదారులుగా నియామకం చేయాలని  తీర్మానించారు.

భారత జర్నలిస్టుల యూనియన్ 11వ ప్లీనరీ సందర్భంగా ఒక స్మారకావళి (savaner)ను ప్రచురించాలని సమావేశం నిర్ణయించింది. ఈ ప్లీనరీ విజయవంతం కావడానికి సంఘ నాయకులు పలువురు ప్రముఖులను సంప్రదించారు.

సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ప్లీనరీ విజయవంతం కావడానికి ఉత్సాహంగా స్పందించారు. కృష్ణా అర్బన్ జిల్లా, విజయవాడ ప్రెస్ క్లబ్ మరియు ఇతర నాయకులతో ఒక ప్రత్యేక సమావేశం వారంలో నిర్వహించనున్నారు.


విజయనగరం జిల్లా నుండి  శివప్రసాద్ ను ఏపీయూజె డిప్యూటీ జనరల్ సెక్రెటరీగా, అలాగే విశాలాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజయ్ బాబును, ఏపీయూజె క్రమశిక్షణ మరియు అర్హత కమిటీ కన్వీనర్‌గా సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
11వ ప్లీనరీ ఏర్పాట్ల కోసం వివిధ ఉప కమిటీలను  త్వరలో ఏర్పాటు చేయాలని కూడా సమావేశం లో నిర్ణయించారు.