అందెశ్రీ అకాల మరణం సాహిత్య రంగానికి తీరని లోటు!

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J . SURENDER KUMAR,

సాహిత్య సమరయోధుడు, ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ  అకాల మరణం సాహిత్య రంగానికి తీరని లోటు అని, సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని తన పాట ద్వారా అన్ని వర్గాలలో రాష్ట్ర ఆకాంక్షను రగిలింప చేసిన అందెశ్రీ అంతక్రియల అంతిమయాత్రలో పాల్గొని ఆయన పాడే మోయడం మరుపురాని చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఆయన రచనలను పుస్తక రూపంలో ముద్రించడం, ఆయన రచనలను విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చడం, అంత్యక్రియలో ప్రాంతాన్ని స్మృతి వనంగా తీర్చిదిద్దుతానని ప్రకటించడం, పద్మశ్రీ అవార్డు కోసం ప్రభుత్వ పక్షాన సిఫారసు చేస్తానని ప్రకటించడం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి  కళాకారులు, రచయితలు, సాహిత్య వేత్తల పట్ల ఉన్న అపార గౌరవానికి నిదర్శనమని మంత్రి అన్నారు.