బిసి వర్గాల బిడ్డ నవీన్ యాదవ్‌ను గెలిపించుకుందాం !



👉 ఎర్రగడ్డ లో జరిగిన దళిత ఆత్మీయుల సమ్మేళనం లో..

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

బలహీన వర్గాల బిడ్డ నవీన్ కుమార్ యాదవ్‌ను మనం గెలిపించుకుందాం అని  ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

👉 ఎర్రగడ్డలో శుక్రవారం జరిగిన దళిత ఆత్మీయుల సమ్మేళనంలోసంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

2014 నుండి 2023 వరకు అధికారంలో ఉన్నవారు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు.తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయని చెప్పారు. కానీ ఎవరి బతుకులు బాగుపడ్డాయి?” అని మంత్రి ప్రశ్నించారు.

👉 ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా? ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇస్తున్నది ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి . అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎన్ని కట్టించారు?” అని ప్రశ్నించారు.

👉 ప్రగతి భవన్‌లో విలాసవంతమైన ఇళ్లు వాళ్లు కట్టుకున్నా, ప్రజల కోసం మా ప్రభుత్వం ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు కట్టి ఇస్తున్నాం,” అని పేర్కొన్నారు.

👉 ప్రతి నెల మీ వాడకు వస్తాను, మీ కష్టసుఖాలు తెలుసుకుంటాను. మీ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి పరిష్కరిస్తాను,” అని మంత్రి లక్ష్మణ్ కుమార్  హామీ ఇచ్చారు.

👉 కేటీఆర్, కేసీఆర్ మీ గల్లీలకు వచ్చారా?
10 ఏళ్ళు మన దళిత, బీద వర్గాల ఇబ్బందులు చూడలేదు,” అని విమర్శించారు.

👉 ఏ పని అయినా, ఏ ఇబ్బంది అయినా మీ ఇంటికే వస్తాను. 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వర్గీకరణ సమస్యను పరిష్కరించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి దక్కిందని మంత్రి అన్నారు.

👉 ప్రజా పాలనకు పట్టం కట్టిన ప్రజలకు ధన్యవాదాలు. ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తోంది,” అని  మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 సమ్మేళనంలో సత్తుపల్లి ఎమ్మెల్యే. మట్టా రాగమయి మాట్లాడుతూ…

మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఎవరు గెలవాలి, ఆలోచించండి. జూబ్లీహిల్స్ అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ గెలవాలి,” అన్నారు.

మహిళలకు పెద్దపీట వేసిన పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ఇద్దరు మంత్రులను అవమానించిన బీ ఆర్ ఎస్ పార్టీకి మహిళల పట్ల గౌరవం లేదు,” అని విమర్శించారు.

దళితులను సీఎం చేస్తామన్నారు, 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు . ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కేటీఆర్ ఈరోజు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు, వేల కోట్లు దోచుకున్నారు,” అని మండిపడ్డారు.

ఏ ప్రభుత్వంలోనూ దళితులకు ఐదు మంత్రుల స్థానం ఇవ్వలేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే, బీజేపీ–బీఆర్‌ఎస్ కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నాయి. సంక్షేమానికి పెద్దపీట వేసేది కాంగ్రెస్ మాత్రమే,” అని పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, టి.ఎం.ఆర్.పి.ఎస్ నాయకులు దేవినేని సతీష్ మాదిగ, రాష్ట్ర నాయకులు మేడి పాపయ్య, ఇటుక రాజు, కనకరాజు, రాజా లింగం, రోజా రాణి, డా. పెరుమాళ్ల రామకృష్ణ, ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు పాల్వాయి నాగేష్, లాజర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.