👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరాగాంధీ ఉక్కు మహిళ లోహసంకల్పం, దేశభక్తి, పేదల పట్ల ఆమెకు ఉన్న మమకారం అపారమైనవని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ధర్మపురి మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ఇందిరగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
ప్రపంచ రాజకీయ చరిత్రలో భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా నిలబెట్టిన నాయకురాలు ఇందిరాగాంధీ అని అన్నారు.
ఆమె తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ కోట్లాది మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని మంత్రి అన్నారు.
ప్రస్తుత తరం యువత ఇందిరాగాంధీ సేవలను అధ్యయనం చేసి, సమాజం కోసం పనిచేసే మనస్తత్వం పెంపొందించుకోవాలనీ గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, దేశ భద్రత విషయంలో ఆమె చూపిన ధైర్యసాహసాలు దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచాయనీ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
