👉 మద్దేడ్ ఏరియా కమిటీ ఇంచార్జ్ బుచ్చన్న తోపాటు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు భార్య ఊర్మిళ హతం ?
J SURENDER KUMAR,
బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు మరియు మావోయిస్టుల మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు ఆటోమేటిక్ ఆయుధాలతో కూడిన ఆరుగురు కీలక మావోయిస్టులు. హతమైనట్టు పోలీసు వర్గాల తెలిపారు.
ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ మద్దేడ్ ఏరియా కమిటీ ఇంచార్జ్ బుచ్చన్న తోపాటు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు భార్య ఊర్మిళ కూడా మృతి చెందినట్టు సమాచారం.
బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ప్రాంతంలో మంగళవారం ఉదయం నుండి అటు ఇటుగా కాల్పులు కొనసాగుతున్నాయి. బీజాపూర్ జిల్లా నేషనల్ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి గురించి సమాచారం ఆధారంగా DRG బీజాపూర్, DRG దంతేవాడ మరియు STF సంయుక్త బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
బీజాపూర్ జిల్లా పోలీస్ అధికారి డా. జితేంద్ర యాదవ్ తెలిపారు. DRG బీజాపూర్, DRG దంతేవాడ మరియు STF సంయుక్త బలగాలు మావోయిస్టులతో మధ్యమధ్యలో కాల్పులు జరుపుతున్నాయి. ఇప్పటివరకు ఆపరేషన్ సమయంలో మృతదేహాలు, ఇన్సాస్ గన్, స్టెన్ గన్, .303 రైఫిల్, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలు మరియు మావోయిస్టు ప్రచార సామగ్రి స్వాధీనం అయ్యాయి. బస్తర్ రేంజ్ ఐజీ సుందరరాజ్ పి. మాట్లాడుతూ, ఈ రోజు జరిగిన ఆపరేషన్‌లో ఆరుగురు కీలక మావోయిస్టు కేడర్లు హతమైనట్లు తెలిపారు.
