కారు పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టారు !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

జూబ్లీహిల్స్ ఓటర్లు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ ఓట్ల మెజార్టీతో గెలిపించి కారు పార్టీకి కారు కాల్చి వాత పెట్టారు అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడంతో శుక్రవారం నియోజకవర్గ పర్యటనలో ఉన్న మంత్రి లక్ష్మణ్ కుమార్, ధర్మారం, ఎండపల్లి, వెల్గటూర్ మండల కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి విజయోత్సవ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ధర్మారం మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ, మిఠాయి పంపిణీ చేస్తూ టపాసులు కాల్చారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ….

సర్వేలు, బాకీ కార్డు పేరుతో ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నించి బీఆర్ఎస్ నాయకులు బొక్కబోర్ల పడ్డారని మంత్రి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన,అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల రాష్ట్ర ప్రజలు చూపిస్తున్న ఆదరణకు ఈ గెలుపేనే నిదర్శనమన్నారు.

ఈ గెలుపుతో మా ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఓటమిని అంగీకరించలేక బీఆర్ఎస్ నాయకులు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు బుద్ధితెచ్చుకొని తమ పద్ధతిని మార్చుకోవాలని మంత్రి సూచించారు.

👉 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం !

వెల్గటూర్ మండలం కోటిలింగాల, ఎండపెల్లి మండలం కొత్తపేట, గొడిసెల పేట గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు