చీఫ్ జస్టిస్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్  ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పాల్గొన్నారు.

పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి కి శుభాకాంక్షలు తెలిపారు. వారి పదవీ కాలం విశిష్టంగా, ప్రభావవంతంగా సాగాలని ఆకాంక్షించారు.

👉 అంధుల క్రికెట్ మహిళల టీమ్ కు అభినందనలు!

అంధుల క్రికెట్ మహిళల టీ20 ప్రపంచ కప్ లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

నేపాల్‌లో జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో భారత జట్టు ప్రదర్శించిన అసాధారణ ప్రతిభ, పట్టుదల, స్పూర్తిని ముఖ్యమంత్రి  ప్రశంసించారు.ఈ విజయం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తుందన్నారు. ధైర్యం, క్రమశిక్షణ, అజేయమైన స్పూర్తి ఉంటే కంటి చూపు లేకున్నా రాణించవచ్చని అంధ మహిళల క్రికెట్ జట్టు మరోసారి నిరూపించిందన్నారు.

👉 ధర్మేంద్ర మృతి బాధాకరం !

భారతీయ చలనచిత్ర రంగంలో రారాజుగా వెలుగొందిన నటుడు ధర్మేంద్ర  మరణం చాలా బాధాకరమని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ఒక సందేశంలో పేర్కొన్నారు. సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించిన విలక్షణ నటుడు ధర్మేంద్ర గారిని కోల్పోవడం చలనచిత్ర రంగానికి తీరని లోటు అని అన్నారు. ధర్మేంద్ర  ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఈ విషాద సమయంలో ధర్మేంద్ర  కుటుంబ సభ్యులు, స్నేహితులు, వారి అభిమానులకు ముఖ్యమంత్రి  ప్రగాఢ సానుభూతిని, తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.

👉 కబడ్డీ ప్రపంచ కప్ 2025 టైటిల్ సాధించిన భారత మహిళలకు  అభినందనలు !

ఢాకా వేదికగా జరిగిన అంతర్జాతీయ మహిళల కబడ్డీ ప్రపంచ కప్ 2025 టైటిల్ సాధించిన భారత మహిళలకు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలిపారు.. ఫైనల్స్ లో అత్యుత్తమ ఆటను ప్రదర్శించి చైనీస్ తైపీపై 35-28 పాయింట్ల తేడాతో విజయం సాధించి వరుసగా రెండో ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకుని భారత కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటారని కొనియాడారు.

అవకాశం ఇస్తే తమలోని ప్రతిభా పాటవాలని ప్రదర్శించి విజేతలుగా నిలుస్తారనడానికి మన మహిళలు నిదర్శనమని అన్నారు. మహిళల జట్టు విజయం ఉన్నత లక్ష్యాలను సాధించాలనుకునే యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు.